Balakrishna: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా క్యామియో పాత్రలలో స్టార్ హీరోలు భాగం కావడం అనేది ట్రెండ్ అవుతుంది. ఇటీవల యంగ్ హీరోల సినిమాలలో స్టార్ హీరోలు అందరూ కూడా కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈయన రజనీకాంత్ కూలి సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.. ఇకపోతే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ(Balakrishna) సైతం ఇలాంటి క్యామియో పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్య ఏ హీరో సినిమాలో కూడా ఇలా గెస్ట్ ఆపియరెన్స్ ఇవ్వలేదు .
మొదటిసారి ఆ పని చేయబోతున్న బాలయ్య..
మొదటిసారి బాలయ్య ఒక యంగ్ హీరో కోసం తన సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాలు తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య కూడా నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
కలెక్షన్ల మోత మోగాల్సిందే..
బాలకృష్ణ ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపించబోతున్నారనే వార్తలు బయటకు రావడంతో బాలయ్య అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాలో భాగమవుతున్నారు అంటే ఈ సినిమా బాక్సాఫిక్ వద్ద కలెక్షన్లు మోత మోగి పోవాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే బాలయ్య ఈ సినిమాలో కేవలం విశ్వక్ సేన్(Vishwak Sen) కోసమే నటిస్తున్నారని చెప్పాలి ఇటీవల కాలంలో వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం నెలకొంది.
విశ్వక్ సేన్ కోసమేనా?
బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి విశ్వక్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ కూడా రెండుసార్లు హాజరై సందడి చేశారు అప్పటినుంచి బాలకృష్ణ వీరి మధ్య ఎంతో మంచి బాండింగ్ నెలకొంది. ఇక ఇటీవల కాలంలో విశ్వక్ నటించిన సినిమాలన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తున్నాయి తప్పా, ఏ సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు దీంతో బాలయ్య ఈ నగరానికి ఏమైంది2 (ee nagaraniki Emaindi ) నటించబోతున్నారని ఈ సినిమా ద్వారా అటు విశ్వక్ సేన్ కు హిట్ ఇవ్వడానికి బాలయ్య సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఈ ఏడాది చివరన లేదా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Star Actress: పెళ్లికి ముందు ఆ హీరోని ప్రాణంగా ప్రేమించిన నటి.. కట్ చేస్తే ఇప్పుడు సింగిల్?