Star Actress: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే కొంతమంది హీరో, హీరోయిన్ల నటనకు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అలాగే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఒక హీరో ప్రేమలో పడ్డారని అయితే అతనిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.. మరి స్టార్ హీరోని ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరో ఎవరు? అనేక విషయానికి వస్తే…
బాలీవుడ్ నటుడు ..
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి మీనా(Meena) ఒకరు. ఈమె బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలు సరసన నటిస్తూ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమెకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) అంటే ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా మీనా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. చిన్నప్పటినుంచి తన నటన చూసి ఎంతో ఇష్టపడేదాన్ని నాకంటూ పెళ్లి జరిగితే ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలని సరదాగా మా అమ్మతో కూడా చెప్పేదాన్ని అంటూ మీనా తెలిపారు.
అనారోగ్యంతో మరణించిన భర్త..
ఇలా హృతిక్ రోషన్ అంటే, ఆయన నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న మీనా కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. అయితే ఈమె హీరోయిన్గా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఐటీ ఉద్యోగి అయిన విద్యాసాగర్ (Vidya Sagar)అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు నైనిక అనే ఒక కుమార్తె కూడా ఉంది. ఇలా వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న నేపథ్యంలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యానికి గురి అయ్యి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఇలా భర్త మరణంతో మీనా ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ఆ హీరోతో రెండో పెళ్లి?
భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మీనా తిరిగి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ మీన సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు. తన భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈమె కోలీవుడ్ స్టార్ హీరో అయినా ధనుష్(Danush) ను రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు కోడై కుసాయి అయితే ఈ వార్తలను మీనా ఖండించిన సంగతి తెలిసిందే. హీరో ధనుష్ కూడా ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈయన రెండో పెళ్లి గురించి కూడా వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మీనా భర్త చనిపోయినా, తన కూతురితో కలిసి ఒంటరిగా ఉంటూ కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు.
Also Read: Fish Venkat: వెంటిలేటర్ పై గబ్బర్ సింగ్ నటుడు.. పరిస్థితి విషమం!