Anshu Ambani:తెలుగు చిత్ర పరిశ్రమలో నవ మన్మధుడు నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాలో అమాయకపు పాత్రలో సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అన్షు అంబానీ(Anshu Ambani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. అలాంటి ఈమె దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా వచ్చిన ‘మజాకా’ సినిమాలో రావు రమేష్ కి జోడిగా యశోద అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇకపోతే మళ్లీ ఈ సినిమా తర్వాత ఈమెకు మరో అవకాశం తలుపుతట్టలేదు.
ఇదిలా ఉండగా .. ఈరోజు అన్షు అంబానీ పుట్టినరోజు. తన 40వ పుట్టినరోజును ఆమె ఘనంగా జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన ఈ 40 ఏళ్ల ప్రాయంలో తన కెరీర్ కు, తనకు స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచింది ఆయనే అంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి. అసలు విషయంలోకి వెళ్తే . రీఎంట్రీలో భాగంగా మజాకా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె తన కెరీర్ కు స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచింది తన భర్త అంటూ చెప్పుకొచ్చింది.
అన్షు అంబానీ మాట్లాడుతూ..” వివాహం తర్వాత నేను ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాను .పిల్లలు పుట్టారు. ఇక నా భర్త తన కంపెనీలతో బిజీగా ఉండేవారు. అయినప్పటికీ కూడా ఒక మంచి భర్తగా , మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. నేను ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు కూడా ఆయన నా కెరియర్ కు ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు. పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూనే నా కెరియర్ కు సహాయపడ్డారు. ఆయన వల్లే నేను మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నా కలను నెరవేర్చుకోగలిగాను” అంటూ అన్షు అంబానీ తన భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ..ఇక తన భర్త వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం అన్షు అంబానీ బర్తడే సందర్భంగా ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
also read:Madhavi Latha: మగాళ్లపై మరోసారి రెచ్చిపోయిన మాధవీలత.. రె*ట్ట వేయడానికి కూడా పనికిరారంటూ!
అన్షు అంబానీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించింది. ఇక తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె లండన్ కి చెందిన సచిన్ సాగర్ అనే వ్యాపారవేత్తతో ఏడు అడుగులు వేసింది. పెళ్లి తర్వాత విదేశాలలోనే సెటిల్ అయిన ఈమె..పెళ్లయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి శాశ్వతంగా కుటుంబానికే పరిమితమైంది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ..ఈమె కూతురు కూడా ఇటీవల హాలీవుడ్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది..