BigTV English

Raashi khanna: రాశి ఖన్నా భావోద్వేగ పోస్ట్.. జీవితాంతం గుర్తుండిపోతాయంటూ!

Raashi khanna: రాశి ఖన్నా భావోద్వేగ పోస్ట్.. జీవితాంతం గుర్తుండిపోతాయంటూ!

Raashi khanna:’ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి ఖన్నా. నాగశౌర్య హీరోగా.. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో రాశి ఖన్నాకి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. అలా ఈ సినిమా క్రేజ్ తో రాశి ఖన్నా మనం సినిమాలో గెస్ట్ గా నటించి.. ఆ తర్వాత జోరు,జిల్,శివం,సుప్రీం,జై లవకుశ, హైపర్, ఆక్సిజన్, తొలిప్రేమ, టచ్ చేసి చూడు,థాంక్యూ ఇలా పలు సినిమాల్లో నటించింది.అయితే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ రాశి ఖన్నాకి పేరు తెచ్చి పెట్టిన సినిమాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. రాశిఖన్నా చేసిన సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ హోదా మాత్రం సంపాదించుకోలేదు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే సినిమాతో మన ముందుకు రాబోతోంది..


కెమెరా ఆగిపోయినా..కొన్ని కథలు జీవితాంతం గుర్తుంటాయి..

తాజాగా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్న రాశి ఖన్నా సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే.. “తెలుసు కదా మూవీలో నా చిత్రీకరణ పూర్తయింది. అయితే కొన్ని సినిమాలలో మన పాత్ర షూటింగ్ అయిపోయి.. కెమెరాలు ఆగిపోయినా కూడా.. ఆ కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక కథే తెలుసు కదా.. ఈ సినిమా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది. ఈ సినీ జర్నీలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రాశి ఖన్నా పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో తెలుసు కదా మూవీ యూనిట్ తో రాశిఖన్నాకు ఉన్న అనుబంధం ఎలాంటిదో.. ఆ కథలో రాశి ఖన్నా ఎంత లీనమైపోయి నటించిందో అర్థం చేసుకోవచ్చు…

ALSO READ:Bigg Boss 9 Telugu Promo 2: నోటి కాడ కూడు లాగేసుకున్న బిగ్ బాస్.. మరీ దారణంరా బాబూ!


తెలుసు కదా సినిమా విశేషాలు..

ఇక తెలుసు కదా సినిమా విషయానికి వస్తే..కోన నీరజ డైరెక్షన్లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా..రాశి కన్నా, శ్రీనిధి శెట్టి లు హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ భరత్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. మరి రాశి ఖన్నా అంతలా అడిక్ట్ అయిన తెలుసు కదా మూవీ ఆమె కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.

రాశి ఖన్నా సినిమాలు..

రాశి ఖన్నా సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా థాంక్యూ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో నటించి మళ్లీ తెలుసు కదా మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమాలో శ్రీ లీల కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ తో కలిసి 120 బహదూర్ మూవీ లో కూడా నటిస్తోంది. అలా వరుస సినిమాలతో రాశిఖన్నా బిజీబిజీగా గడుపుతోంది..

Related News

Pawan Kalyan-Allu Arjun: ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్‌కి కనువిందే!

Nandamuri Balakrishna : బాలయ్య కు మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఆ ఘనత

Nani New Movie : 30 ఎకరాల స్లమ్‌లో నాని కష్టాలు… ఆ డైరెక్టర్ అసలేం చేస్తున్నాడో

Akkineni Akhil : బిగ్ బ్రేకింగ్ – తండ్రి కాబోతున్న అక్కినేని అఖిల్ ?

Ram Pothineni: ప్రేమలో పడ్డాడు.. అప్పుడు రాశాడు… ఇప్పుడు పాడాడు

Kantara: Chapter 1 : కాంతార: చాప్టర్‌ 1 మళ్లీ వాయిదా.. ఒక్క పోస్ట్‌తో తేల్చేసిన మేకర్స్‌..

Big Stories

×