Rachita Ram:రచితా రామ్ .కన్నడ ఇండస్ట్రీలో ‘డింపుల్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఈ అందాల భామ తాజాగా ఒక అభిమాని సెల్ఫీ పేరుతో ఈ భామ ముద్దు గిల్లడంతో మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది.
రచితా రామ్ కెరీర్ విషయానికి వస్తే ఆమె బుల్లితెరపై నటిగా తన జర్నీని మొదలెట్టింది. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో తనకు వచ్చిన తొలి పారితోషికం కేవలం రూ.750 మాత్రమే అని ఆమెనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .అలా చిన్న మొత్తంతో మొదలైన జర్నీ ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి రావడం విశేషం..
సినిమాల విషయానికి వస్తే 2013లో ‘బుల్బుల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్సినా రచితా రామ్.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకోవడం విశేషం.అలా ‘రన్నా’, ‘భర్జరి’, ‘పుష్పక విమాన’, ‘అయోగ్య’, ‘నతసార్వభౌమ’, ‘సీతారామ కళ్యాణ’ వంటి సూపర్ హిట్ సినిమాలని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా స్టార్ హీరోలతో కలిసి నటించడంతో ఆమె మార్కెట్ కూడా ఒక్కసారిగా దూసుకుపోయింది.
రూ.750 నుంచి కోట్ల వరకు..
ఇక రచితా రామ్ పారితోషికం విషయానికి వస్తే మొదట్లో రూ.750 తీసుకున్న ఆమె.. ఆ తర్వాత లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా ఎదగడం విశేషం . గతంలో ఆమె రూ.35-40 లక్షల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే ఈ మధ్య కాలంలో రచితా రామ్ ఒక్క సినిమాకు రూ.1 కోటి కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలు రాగా ఆమె స్పందిస్తూ.. తన రెమ్యునరేషన్ సినిమా కథ, పాత్ర, డేట్స్ వంటి వాటిపై డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇక కొన్ని తాజా మీడియాలలో ఏకంగా రచితా రామ్ ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినా వాటిని ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.కాబట్టి ఈ లెక్క గాసిప్స్ గానే చూడాలి.
ఫ్యాన్ క్రేజ్ కూడా మామూలుగా లేదుగా..
ఇక రచితా రామ్‌కు సినిమాల్లోనే కాదు.. బయట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎక్కడ కనిపించినా అభిమానులు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఈ మధ్య ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులో ఓ అభిమాని రచితా రామ్ బుగ్గలు గిల్లడంతో ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది.
ఇక ఆ వీడియో చూసిన అభిమానులు రచితా రామ్‌కు ఉన్న ఫయాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి అంటూ కామెంట్స్ చేయగా ,మరికొందరు అలా పబ్లిక్ గా గిల్లడం ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ కూడా వదిలారు. అయితే ఇదే విషయం రచితా స్పందిస్తూ ఆ అభిమాని చేసిన దాంట్లో తనకి తప్పేమీ కనబళ్ళేదని ,అది సరదాగా తన అభిమానం చూపెట్టిన తీరని చెప్పడం విశేషం.
ఏది ఏమైనా ఒకప్పుడు సీరియల్‌లో రూ.750తో కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్‌గా ఎదిగి.. ఇప్పుడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుండటం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.