SV Medical College: తిరుపతి జిల్లాలోని ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు వేసారు. సుదీర్ఘకాలంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు ఆరోపణలు రావడంతో అధికారుల వారిపై వేటు వేసారు. దీంతో పాటుగా కొన్ని రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో ముగ్గురు వైద్యులను ఉన్నతాదికారులు డిస్మిస్ చేసారు.
వీరిలో మెటర్నిటీ ఆస్పత్రి గైనకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. యమునపై అధికారుల చర్యలు తీసుకున్నారు. రుయా ఆస్పత్రి మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. ప్రతాప్, మరియు పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. దివ్యాసాయిపై కూడా అధికారుల వేటు వేసారు. అయితే మరికొందరు వైద్యులపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విధుల్లో దీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రోజువిధులకు హజరుకాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపనల నేపథ్యంలో అధికారులు వీరిపై వేటు వేసారు. వీరితో పాటు ఇంకొంత మంది వ్యక్తులు వీరికి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వీరిపై కూడా చర్యలు తీసుకోకున్నట్టు ఉన్నతాదికారులు తెలిపారు.
Also read: క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!