E-Paper
Advertisement

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!
Advertisement

Phone Addiction Psychology: మనుషుల మనస్తత్వం ఎంత విచిత్రంగా ఉంటుందో కదా! పొద్దున్నే లేవగానే మొబైల్ వైపు చేయి వెళ్లడం మనలో చాలామందికి అలవాటుగా మారిపోయింది. కళ్లు తెరవకముందే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఈ-మెయిల్స్ చెక్ చేసేస్తుంటాం. చాలామంది దీనిని ఫోన్ అడిక్షన్ అనుకుంటారు. కానీ, సైకాలజీ ప్రకారం.. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. మనం లేవగానే ఫోన్ చూడటం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. మన మైండ్ పనిచేసే విధానానికి సంకేతం. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

రాత్రికి రాత్రే ఏం మారింది?

మనం నిద్రపోతున్నప్పుడు లోకంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని మన మెదడు ఎంతో ఆరాటపడుతుంది. రాత్రి ఎవరు మెసేజ్ చేశారు, ఆఫీస్ నుంచి ఏమైనా మెయిల్స్ వచ్చాయా లేదా వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడం వల్ల మనసుకు ఒకరకమైన స్పష్టత వస్తుంది. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్న రోజున లేవగానే ఫోన్ చూడటం మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికే. లోకంలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవాలనే సహజమైన కోరిక వల్లే మనం ఫోన్ చేరుకుంటాం.

Advertisement

Also Read: ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

మెదడు అలవాటుపడిన తీరు..

ఏదైనా ఒక పనిని రోజూ ఒకే సమయంలో చేస్తే అది మైండ్‌లో ఒక సీక్వెన్స్‌లా ఉండిపోతుంది. ఉదయాన్నే అలారం ఆపడం, వెంటనే పక్కనే ఉన్న ఫోన్ చేతిలోకి రావడం ఒక అలవాటుగా మారిపోతుంది. ఫోన్ చూడగానే లభించే కొత్త సమాచారం మనకు ఒక రివార్డ్‌లా అనిపిస్తుంది. దాంతో రోజూ ఉదయాన్నే ఫోన్ చెక్ చేస్తేనే రోజు మొదలైనట్లు మన బ్రెయిన్ ఫీలవుతుంది. ఈ లోప్ వల్ల మైండ్ దీనిని ఒక దినచర్యగా మార్చుకుంటుంది.

ఏదో ఒక సర్‌ప్రైజ్..

Advertisement

ఫోన్ స్క్రీన్ మీద ప్రతీ రోజూ మనకు నచ్చే సమాచారమే ఉండకపోవచ్చు. ఒకరోజు పాత స్నేహితుడి మెసేజ్ రావచ్చు, మరోరోజు అసలు ఏమీ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏదైనా మంచి వార్త మనల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఈ అంచనా వేయలేని ధోరణే మనలో మరింత కుతూహలాన్ని పెంచుతుంది. ప్రతీసారి కొత్తగా ఏదో ఒక విషయం దొరుకుతుందనే ఆశే మనల్ని రోజూ ఉదయాన్నే స్క్రీన్ వైపు చూసేలా చేస్తుంది.

రోజును సిద్ధం చేసుకోవడం..

కొన్ని గంటల నిద్ర తర్వాత మళ్లీ ఈ ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ ఒక సులువైన మార్గంగా కనిపిస్తుంది. సమయం ఎంతైంది, ఇవాళ పనులేంటి, షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకోవడం ద్వారా రోజంతా ఎలా ఉండబోతోందో మైండ్‌లో ఒక మ్యాప్ సిద్ధమవుతుంది. కాబట్టి.. ప్రతీసారి ఫోన్ చూడటం అడిక్షన్ కాకపోవచ్చు. అయితే, ఆ ఒక్క చూపు కాస్త గంటల కొద్దీ సోషల్ మీడియా స్క్రోలింగ్‌గా మారకుండా చూసుకుంటే మన ఉదయం చాలా హ్యాపీగా సాగిపోతుంది.

Also Read: ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×