Nani The Paradise Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు నాని(Nani). ప్రస్తుతం ఈయన వరుస హిట్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. కోర్ట్ సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న నాని, హిట్ 3 సినిమా ద్వారా హీరోగా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
నానితో తలపడనున్న రాఘవ్..
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal) నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్న ఇప్పటివరకు చిత్ర బృందం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. అయితే నేడు నటుడు రాఘవ్ జుయల్ పుట్టినరోజు(Birthday) సందర్భంగా ది ప్యారడైజ్ చిత్ర బృందం నటుడు రాఘవ్ జుయల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేశారు. నటనలో ఎంతో టాలెంట్ కలిగిన రాఘవ్ ను తెలుగు సినిమాకి ఒక కొత్త లుక్ లో, కొత్త పాత్రలో పరిచయం చేస్తూ చిత్ర బృందం ది ప్యారడైజ్ ప్రపంచంలోకి ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
కిల్ సినిమా విలన్ గా..
ఇలా నటనలో ఎంతో నైపుణ్యం కలిగిన రాఘవ్ నాని సినిమాలో భాగం కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచుకుంటున్నారు. ఇక రాఘవ్ బాలీవుడ్ సెన్సేషన్ చిత్రం కిల్ సినిమాలో విలన్ పాత్రలో నటించి తన నటన విశ్వరూపం చూపించారు. ఇలాంటి ఒక గొప్ప నటుడు నాని సినిమాలో భాగం కాబోతున్నారని తెలియగానే ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ వారు అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Happy Birthday @TheRaghav_Juyal ❤️🔥
Welcome to #TheParadise 🐦⬛
In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@sudhakarcheruk5 @Dop_Sai @NavinNooli @artkolla @SLVCinemasOffl @saregamasouth… pic.twitter.com/f7BygPKF7Y— THE PARADISE (@TheParadiseOffl) July 10, 2025
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే విడుదల తేదీని కూడా ప్రకటించారు. నాని ఇదివరకే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా(Dasara) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. తదుపరి ది ప్యారడైజ్ సినిమాలో అవకాశం కల్పించారు. అదేవిధంగా నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తిరిగి చిరు సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.
Also Read: 15 నిమిషాలకే కోట్లలో రెమ్యూనరేషన్.. ఈ హీరో రేంజ్ మామూలుగా లేదుగా?