Guru Purnima 2025: మనం భారతీయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రకారం ఎన్నో ప్రత్యేకమైన రోజులను ఘనంగా జరుపుకుంటాము. ఇలా ప్రత్యేకమైన రోజులలో “గురు పౌర్ణమి” కూడా ఒకటి. ఈ గురు పౌర్ణమిని “ఆషాడ పూర్ణిమ” లేదా “గురుపూర్ణిమ”(Guru Purnima) అని కూడా పిలుస్తారు. ఆదియోగి మొదట ఆది గురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్ర రోజు కావడంతో ఈరోజును గురు పౌర్ణమిగా పిలువబడుతుంది. ఇక ఈ రోజున భారతదేశము మొత్తం ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇలా ఈ గురు పౌర్ణమి వేడుకలు ఈ ఏడాది కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ (Eesha Foundation)లో సద్గురు (Sadhguru)సమక్షంలో ఎంతో ఘనంగా జరగబోతున్నాయని తెలుస్తోంది. మరి నేడు (జులై 10) న సద్గురు ఆశ్రమంలో జరగబోయే గురు పౌరమి వేడుకల విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..
సద్గురు అర్పణం..
ఈ ఏడాదికి మొట్టమొదటిసారిగా సద్గురు అర్పణం పేరుతో ఏడు రోజులపాటు ఆన్లైన్ సాధనని ప్రారంభించారు. అయితే ఇది నేడు గురు పౌర్ణమి రోజున ముగియనుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి గురు పౌర్ణమి మంత్రం ధ్యాన లింగానికి పవిత్రమైన సమర్పణతో సాధనను ముగియించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ధ్యాన లింగంలో పాలతో అర్పణ చేయవచ్చు అలాగే నీటితో కూడా అర్పణ చేయవచ్చు. పాలతో అర్పణ చేసేవారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్పణ అందిస్తారు. అలాగే జలార్పణం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు అందిస్తారు.
ఈషా ఫౌండేషన్ లో గురు పౌర్ణమి వేడుకలు..
ఇక ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున ధ్యాన లింగానికి క్షీరార్పణం లేదా జలార్పణం అర్పించి ధ్యాన లింగ అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే గురు పౌర్ణమి రోజు ఇలా ధ్యాన లింగానికి అర్పణ చేయటం ఎంతో పవిత్రమైన అవకాశంగా భావిస్తారు. ఇక నేడు ఈషా ఆశ్రమంలో జరగబోయే ఈ గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా సాయంత్రం ఏడు గంటలకు సద్గురు చేత ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈషా సంగీత బృందం ప్రసిద్ధ కళాకారులతో ప్రదర్శనలు జరగబోతున్నాయి.
సద్గురు అధికారక యూట్యూబ్ ఛానల్..
ఈ కార్యక్రమంలో భాగంగా మోహిత్ చౌహాన్, రామ్ మిర్యాల, పార్థివ్ గోహిల్ , స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. అదేవిధంగా త్రినిదాదియన్ సోకా కింగ్ మాచెల్ మాంటానో కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇలా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సద్గురు సమక్షంలో జరగబోతున్న ఈ గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన లేనటువంటి భక్తులు సద్గురు అధికారక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమ్ లో చేరవచ్చు. అయితే ఈ లైవ్ స్ట్రీమ్ తెలుగు, తమిళ, హిందీ ,కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతి, ఒడియా, నేపాలి భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషలలో కూడా లైవ్ స్ట్రీమ్ అందుబాటులోకి రాబోతుంది.. ఇలా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేని వారు ఈ విధంగా గురు పౌర్ణమి వేడుకలను తిలకించవచ్చు.
Also Read: ఈ ‘కిల్ల’రే నానిని ఢీ కొట్టే విలన్