E-Paper
Advertisement

విమానం రంగంలో చైనా దూకుడు.. ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్

విమానం రంగంలో చైనా దూకుడు.. ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్
Advertisement

China: చైనా దూకుడు పెంచింది. విమాన రంగంలో దూసుకుపోతోంది. సొంతంగా విమానాలు తయారీ చేయడం మొదలుపెట్టింది. ఆ మధ్య రవాణా విమానం తయారు చేసింది. అది సక్సెస్ కావడంతో రూటు మార్చింది. ఈసారి ఏకంగా ఎలక్ట్రిక్ విమానం తయారు చేసింది. తొలి ప్రయాణం సక్సెస్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

విమానం రంగంలో చైనా దూకుడు

విమానయాన సెక్టార్‌పై చైనా ఫోకస్ చేసింది. ఈ క్రమంలో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. గతేడాది తొలి రవాణా విమానం తయారు చేసిన చైనా, ఈసారి మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ రంగ సంస్థ కోమాక్ ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం సీఈ-25ఏని అభివృద్ధి చేసింది. అంతేకాదు దాన్ని తొలి ప్రయోగం కూడా సక్సెస్ కావడంతో వారి ఆనందాలకు అవదుల్లేకుండా పోయింది.

Advertisement

చైనా స్వతంత్రంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం CE-25A సక్సెస్ అయ్యింది. శనివారం ఆ విమాన ప్రయాణాన్ని పూర్తి చేసిందని కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా-COMAC వెల్లడించింది. ఇందుకు తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని బిన్‌జౌ ప్రాంతం వేదికైంది. ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్ ఉన్నారు. విమానం సాధారణంగా పని చేసిందని, పని తీరు అంచనాలకు అనుగుణంగా ఉందని COMAC తెలిపింది.

ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్

మొత్తం 57 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో విమానం 16 నిమిషాలు నింగిలో విహరించింది. దాదాపు 60.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ విమానం ఫిబ్రవరిలో తొలి మానవ రహిత ప్రయోగాన్ని సక్సెస్ చేసింది. CE-25A అనేది COMAC తొలి ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం. చైనాలోని వివిధ నగరాల మధ్య ప్రయాణాల కోసం తయారు చేసిన తొలి వాణిజ్య విమానం. ఇది 19 మంది ప్రయాణికులను అమాంతంగా తీసుకెళ్లగలదు. దీని బరువు 10 టన్నులు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Advertisement

2400 మీటర్ల ఎత్తు, 400 కిలోమీటర్ల పరిధిని కలిగివుంది. విమానం రెక్కలకు అమర్చిన 10 ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్ల సాయంతో పని చేస్తుంది. COMAC- చైనా బ్యాటరీ తయారీదారు CATL- షాంఘై జియావో టాంగ్ విశ్వవిద్యాలయం, ఇతర భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. చైనా పౌర విమానయాన పరిపాలన సంస్థ.. టైప్ సర్టిఫికేట్ కోసం COMAC దరఖాస్తును ఆమోదించింది.

 

Related News

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!

ట్రావెల్ ట్రిప్ ప్లానింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త

60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

8 ఫాస్ట్ నమో భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయాణికులకు ఇక పండుగే!

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!

RAC విధానానికి గుడ్ బై.. రైల్వే సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×