5 Most Expensive Bikes: సాధారణంగా బైక్ కొనాలంటే మైలేజీ, ఇంజిన్ కెపాసిటీ, డిజైన్, ధరను చూస్తుంటారు. కానీ, ప్రపంచంలో కొన్ని బైకుల ధరలు మాత్రం లగ్జరీ కార్లను తలదన్నేలా ఉన్నాయి. వీటిలో స్పెషల్ డిజైన్, అరుదైన తయారీ, అత్యాధునిక సాంకేతికతతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. కొన్ని బైకులను ప్రపంచ వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే తయారు చేశారు. మరికొన్ని ప్రత్యేక కళాఖండాలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన 5 బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులలో నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. దీని ధర ఏకంగా 11 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.91 కోట్లకు పైమాటే. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 45 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ లిస్టులో రెండో స్థానంలో 1949 AJS E90 పోర్కుపైన్ ఉంది. దీని విలువ సుమారు 7 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.48 నుంచి రూ.50 కోట్లు. ఇది సాధారణ బైక్ కాదు.. బైక్ రేసింగ్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన మోడల్. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించిన ఈ బైక్ కేవలం నాలుగు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఎకోస్ ES1 స్పిరిట్ బైక్ ధర సుమారు 3.6 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.36 కోట్లు. దీని తయారీలో ఫార్ములా 1 రేసింగ్ కార్ల డిజైన్ టెక్నాలజీని ఉపయోగించారు. తేలికైన కార్బన్ ఫైబర్ బాడీ, ప్రత్యేకమైన నిర్మాణం ఈ బైక్‌ను మిగతా మోడళ్లకు భిన్నంగా నిలబెడతాయి.
BMS నెహెమెసిస్ బైక్ అంచనా ధర 3 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.24 నుంచి రూ.25 కోట్లు. దీని ప్రత్యేకత 24 క్యారెట్ల బంగారు పూత. అంతేకాకుండా సాధారణ బైకుల్లో కనిపించని హబ్‌లెస్ వీల్ డిజైన్‌ను ఇందులో ఉపయోగించారు. విలాసవంతమైన లుక్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణ.
ఈ లిస్టులో ఐదో స్థానంలో హార్లే డేవిడ్సన్ కాస్మిక్ స్టార్‌షిప్ ఉంది. దీని అంచనా ధర 1.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.12 కోట్లు. ప్రముఖ కళాకారుడు జాక్ ఆర్మ్ స్ట్రాంగ్ స్వయంగా ఈ బైక్‌పై ప్రత్యేక పెయింటింగ్ వేశారు. అందుకే ఇది కేవలం మోటార్‌సైకిల్‌గా కాకుండా ఒక అరుదైన కళాఖండంగా గుర్తింపు పొందింది.
Read Also: అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!