Tharun Bhascker:తరుణ్ భాస్కర్ ..సైన్మా అనే షార్ట్ ఫిలిమ్ తో మంచి పేరు తెచ్చుకుని,పెళ్లి చూపులు సినిమాతో నేషనల్ అవార్డ్ కొట్టేసిన ఈ మల్టీ టాలెంటెడ్ ఇపుడు వరుస సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా మారిపోయిన సంగతి తెల్సిందే.
అయితే తాజాగాగా తన కెరీర్ లో ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయిన సినిమా ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ గా ENE (ఈ నగరానికి ఏమైంది)2కి దర్శకత్వం వహించి మరోసారి ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్ల లో పాల్గొంటూ సందడి చేస్తున్న తరుణ్ ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు గురించి,అలాగే సినిమా బాక్సాఫీస్, బడ్జెట్ లెక్కలపై ఇలా చెప్పుకొచ్చాడు.
వెంకటేష్‌తో చేయాలనుకున్న సినిమా
సురేష్ బాబు దగ్గర పని చేయడం కష్టమని, ప్రతి నిర్ణయానికి చాలా సమయం తీసుకుంటారని బయట ప్రచారం జరుగుతుంటుందని అయితే తన విషయంలో మాత్రం ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని స్పష్టం చేశాడు.
తాను ప్రతి సినిమా విషయంలో ముందుగానే పక్కా ప్లాన్ తో రెడీ అయిపోతానని,షూటింగ్‌కు వెళ్లే ముందు ప్రతి విషయం పర్ ఫెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తానని తెలిపాడు.ఇక సురేష్ బాబు తనకు ఎప్పుడూ కథను మార్చమని ఒత్తిడి చేయలేదని, పైగా త్వరగా కథ రాయాలని ఫోన్ చేసి అడిగేవారని అసలు విషయం చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్.
ఇక వెంకటేష్‌తో చేయాలనుకున్న సినిమా ఆగిపోవడానికి సురేష్ బాబు కారణం కాదని కూడా స్పష్టం చేశారు. ఆ సినిమా సెకండాఫ్ తనకు నచ్చకపోవడంతో అది వర్కౌట్ కాదని తానే చెప్పినట్లు సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని బయట పెట్టేశాడు.
‘ఈ నగరానికి ఏమైంది’ బాక్సాఫీస్ లెక్కలు..
ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి థియేట్రికల్ రన్ ద్వారా దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అంతేకాదు, ఈ సినిమా థియేటర్లలో సుమారు 47-48 రోజుల పాటు ఆడిందని ,ఇక ఓటీటీ రైట్స్ ద్వారా మంచి లాభాలే వచ్చాయని తెలిపాడు .
అయితే ‘పెళ్లిచూపులు’ సినిమాతో పోల్చడం వల్ల రెండో సినిమాకు వచ్చిన సక్సెస్ ని చాలా మంది చిన్న చూపు చూశారని ‘పెళ్లిచూపులు’ కాంతి సినిమానే చేయాలని అనుకుంటే పెద్ద హీరోను తీసుకోవడం లేదా సేఫ్ జోన్ లో స్టోరీ ఎంచుకుని సినిమా తీసేవాడినని, కానీ తాను మళ్లీ ఎక్స్ పరిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ‘ఈ నగరానికి ఏమైంది’ తీశానని తెలిపాడు.
అది సబ్బుల వ్యాపారం కాదు!
ఇక ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక సినిమా విజయం గురించి మాట్లాడేటప్పుడు శుక్రవారం కలెక్షన్లు, మొదటి రోజు వసూళ్లు, ఓపెనింగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అన్నారు.సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, బాక్సాఫీస్ లెక్కలు, ఒక సినిమా ఎంత వసూలు చేసింది? మరో సినిమా కంటే ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది? అనే డిబేట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయని,కానీ సినిమా అనేది సబ్బుల వ్యాపారం కాదని, దానికంటూ ఒక కల్చరల్ వాల్యూ ఉంటుందని తరుణ్ భాస్కర్ చెప్పిన మాటలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ALSO READ :పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !