Junior Pre-release event : గాలి జనార్ధన రెడ్డి కొడుకు గాలి కిరీటి నటిస్తున్న సినిమా జూనియర్. ఈ సినిమా నుంచి వైరల్ సాంగ్ విడుదలై బాగా వైరల్ అయింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శ్రీ లీల ఎనర్జీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ శ్రీ లీలా ఎనర్జీని గాలికిరీటి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు. ఇక్కడితో గాలి కిరీటి కి కూడా మంచి పేరు వచ్చింది.
గాలి కిరీటి నటించిన జూనియర్ సినిమా జులై 18న విడుదల అవుతున్న సందర్భంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు అంటే ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ని పక్కన పెట్టేసారు
రాజమౌళి మాట్లాడుతున్న తరుణంలో మహేష్ బాబు ఫ్యాన్స్ బాబు బాబు అని అరవడం మొదలుపెట్టారు. కానీ రాజమౌళి అసలు రెస్పాండ్ కాలేదు. తన స్పీచ్ లో కూడా ఎక్కడ తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా జూనియర్ సినిమాకు సంబంధించి మాట్లాడారు. అయితే స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా సుమ ఏమైనా ఆ సినిమా గురించి అడుగుతుందేమో అని అనుకున్నారు. ఆవిడ కూడా నేనేమీ అడగదలచుకోవట్లేదు అంటే చెప్పేశారు. దానికి కూడా రాజమౌళి సరే అంటూ తల ఊపుకొని స్టేజ్ దిగిపోయారు. ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు కాబట్టి బాబు బాబు అని అరవటం వలన ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ ను రాజమౌళి పక్కన పెట్టేశారు.
అంచనాలన్నీ ఆ సినిమా పైనే
త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి SSMB29 సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా మునుపెన్నడు కనిపించిన విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. పృధ్విరాజ్ కి జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియలేదు. ఏదేమైనా రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా గురించి మాత్రం నోరు విప్పలేదు.
Also Read : Rajamouli: జెనీలియా నీ అందం అలానే ఉంది, బానే సిగ్గుపడుతున్న జక్కన్న