Rajamouli: కొంతమందికి ఏజ్ పెరుగుతున్నకొద్ది అందం కూడా పెరుగుతూనే ఉంటది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. నయనతార త్రిష వంటి హీరోయిన్స్ ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే అప్పటికంటే ఇప్పుడే చాలా అందంగా అనిపిస్తుంటారు. ఒక ప్రస్తుతం ఆ లిస్టులో జెనీలియా కూడా చేరిపోయింది.
జెనీలియా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బొమ్మరిల్లు అనే సినిమాలో హాసిని అనే పాత్రతో ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన సై సినిమాలో కూడా కనిపించింది జెనీలియా.
జెనీలియా నీ అందం అలానే ఉంది
ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడు మాట్లాడినా కూడా అందరిని గౌరవిస్తూ చాలా పద్ధతిగా మాట్లాడుతారు. ఇక జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రాజమౌళి అదే స్థాయిలో తన స్పీచ్ కొనసాగించారు. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు, చిన్న సినిమా అనుకున్నాను కానీ ఒక్కొక్క టెక్నీషియన్స్ ని పరిచయం చేస్తున్న తరుణంలో ఇది చాలా పెద్ద సినిమా అని అర్థమైంది. దాదాపు 1000 స్క్రీన్సుకు పైన ఈ సినిమా విడుదలవుతుంది. అయితే జెనీలియాని ఉద్దేశిస్తూ జెనీలియా మీ అందం అలానే ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయింది నీ బ్యూటీ, నీగ్రేస్ అలానే ఉండిపోయింది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియా ని చూపిస్తాడు అని అనుకుంటున్నాను. రాజమౌళి ఈ మాటలను చాలా సిగ్గుపడుతూ చెప్పారు. రాజమౌళిని అలా చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం.
కిరీటి వాళ్ళు చెప్పారు అంటే నువ్వు గ్రేట్
మామూలుగా పీటర్ హెయిన్ మాస్టర్, సెంథిల్ ఎవరిని పొగడరు అటువంటిది నీ గురించి కూడా మంచిగా చెప్పారు అంటే నువ్వు చాలా టాలెంటెడ్ అని అర్థమవుతుంది. అంటూ చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా గాలి కిరీటి వ్యక్తిత్వం కూడా చాలామందికి తెలిసి వచ్చింది. అతి చిన్న ఏజ్ లో ఇంత బాగా మాట్లాడగలిగిన మెచ్యూరిటీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక డాన్స్ తో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ అయిపోయింది. ఇక సినిమాలో ఎంత మెప్పించాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది. కొంతమేరకు ట్రైలర్ కూడా మంచి అంచనాలని క్రియేట్ చేసింది.
Also Read: Rajamouli: మరీ అంత మాట అనేసావ్ ఏంటి జక్కన్న, అది ఫేవరెట్ సినిమా అయితే మిగతా సినిమాలేంటి.?