Andre Russell Retirement : కోల్ కతా డేంజర్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్టు ESPNcricinfo తెలిపింది. అయితే ఈనెల 22న ఆస్ట్రేలియాతో జరిగబోయే రెండో టీ-20 మ్యాచ్ లో ఆయన ఆడనున్నట్టు సమాచారం. అయితే 2019 నుంచి రస్సెస్ టీ-20 క్రికెట్ ఆడుతున్నాడు. 2012 2016 టీ-20 వరల్డ్ కప్ లో ఆయన వెస్టిండీస్ తరపున ఆడారు. వాస్తవానికి రస్సెస్ వెస్టిండీస్ తరపున కంటే కోల్ కతా నైట్ రైడర్స్ తరపునే ఎక్కువగా పరిచయం. కోల్ కతా జట్టు విజయాల్లో రస్సెస్ కీలక పాత్ర పోషించాడు. గతంలో రెండు, మూడు సార్లు టైటిల్ సాధించడంలో రస్సెస్ పాత్ర కీలకం అనే చెప్పాలి. రస్సెస్ క్రీజులో ఉంటే ఆ సమయంలో సిక్సుల మోత మోగాల్సిందే. అందుకే కోల్ కతా నైట్ రైడర్స్ గత సీజన్ లో కెప్టెన్ వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ ని అయినా వదులుకుంది. కానీ రస్సెల్ ని మాత్రం వదులుకోలేదు. రస్సెస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరీ.
Also Read : Virat Kohli: ఇంగ్లాండ్ అభిమానుల మీద ఉమ్మేసిన విరాట్ కోహ్లీ.. ఇదిరా బ్రాండ్ అంటే
విధ్వంసక ఆటగాడు.. పేలవ ప్రదర్శన..
ఈ వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఇటీవల పేలవ ఫామ్ తో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా అంతగా రాణించలేదు. దీంతో అతను క్రికెట్ కి వీడ్కోలు పలికేస్తాడని రిటైర్ అయిపోతాడని వార్తలు వినిపించాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధనాధన్ షాట్లతో అదుగొట్టాడు రస్సెల్. కేవలం 25 బంతుల్లోనే 57 పరుగులు చేసి కేకేఆర్ కి భారీ స్కోరు అందించాడు. దీంతో రస్సెల్ ఇప్పుడే రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తేల్చి పారేశాడు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని వార్తలు వినిపించడం గమనార్హం. రస్సెస్ మాత్రం ఇంకా 2 లేదా 3 ఐపీఎల్ సీజన్స్ ఆడాలనుకుంటున్నాడట. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్పిన్నర్స్ ని రస్సెల్ ఆడలేకపోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
కేకేఆర్ అంటేనే.. ఆండ్రూ రస్సెల్..
వయస్సు ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ జట్టు విజయాల్లో భాగస్వాములుగా ఉంటే చాలు. మనం ఆటను అద్భుతంగా ఆడితే ఏ జట్టు అయినా కొనుగోలు చేస్తుందనే ధోరణిలో రస్సెల్ ఉంటాడు. రస్సెల్ వేలంలోకి వస్తే.. భారీగానే కొనుగోలు చేయాలని మిగతా జట్లు భావించాయి. కానీ రస్సెస్ ఎక్కువగా కేకేఆర్ జట్టు తరపున ఆడాడు. కేకేఆర్ రస్సెల్ పై ఎంతో నమ్మకంగా ఉంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పటి నుంచి రస్సెల్ కేకేఆర్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక అప్పటి నుంచి అద్భుతంగా ఆడుతూ జట్టును విజయాల్లోకి తీసుకెళ్లాడు. కేకేఆర్ సాధించిన టైటిల్స్ లో రస్సెల్ పోరాటం కూడా ఉంది. కేకేఆర్ 2024లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. కానీ 2025 సీజన్ లో కనీసం ప్లే ఆప్స్ కి కూడా చేరుకోకపోవడం గమనార్హం.