BigTV English

RCB: ఐపీఎల్ 2026 కోసం RCB భారీ ప్లాన్….జట్టులోకి తెలుగోడు… ఆ ఇద్దరు ఔట్ !

RCB: ఐపీఎల్ 2026 కోసం RCB భారీ ప్లాన్….జట్టులోకి తెలుగోడు… ఆ ఇద్దరు ఔట్ !

RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది బెంగళూరు అభిమానులు మరణించారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యానికి ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఈ కేసు ఉన్నప్పటికీ… 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సన్నద్ధమవుతోంది. ట్రేడ్ రూల్ ను వినియోగించుకొని… కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.


Also Read: Indian Team : స్కూల్ పిల్లల లాగా…. టీమిండియా ప్లేయర్లను లైన్ లో నిలబెట్టిన ఇంగ్లాండ్.. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

తెలుగోడిపై కన్నేసిన బెంగళూరు యాజమాన్యం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమవుతోంది. తమ మెడకు తొక్కిసలాట సంఘటన కేసు ఉన్నప్పటికీ… వచ్చే సీజన్ పైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలుగు కుర్రాడిపై బెంగళూరు యాజమాన్యం కన్నేసింది. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న… తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కొనుగోలు చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. బిగ్ స్కెచ్ వేసింది.

ట్రేడ్ రూల్ ఉపయోగించి అతన్ని జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. తిలక్ వర్మ… ముంబై ఇండియన్స్ జట్టుకు.. చాలా బాగా ఆడుతున్నాడు. రెండో వికెట్, మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్… ఇలా ఇక్కడ బ్యాటింగ్ కు పంపినా కూడా తిలక్ వర్మ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఎక్కడ కూడా వణుకు బెనుకు లేకుండా వ్యవహరిస్తున్నాడు తిలక్ వర్మ. దానికి తగ్గట్టుగానే టీమిండియాలో కూడా ఛాన్స్ కొట్టేసి.. ఇరగదీస్తున్నాడు. టీమిండియా టి20 జట్టులో యువరాజ్ సింగ్ పాత్రను పోషిస్తున్నాడు తిలక్ వర్మ. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాటింగ్ బాగా చేసి రానిస్తున్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.

అందుకే ట్రేడ్ రూలు ఉపయోగించి ఎలాగైనా.. తిలక్ వర్మను జట్టులోకి తీసుకువచ్చేందుకు బెంగళూరు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్, రసిక్ సలాం ఇద్దరినీ ముంబైకి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇద్దరినీ ఇచ్చి తిలక్ వర్మాను జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అవసరమైతే ఇంకో 5 కోట్లు పెట్టైనా సరే అతన్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా మొన్న ముంబై ఇండియన్స్… తిలక్ వర్మ.. కోసం 8 కోట్లు ఖర్చు పెట్టింది.

Also Read:  Rohit Sharma – London: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ దంపతులు.. ఇండియాకు గుడ్ బై?

18 ఏళ్ల తర్వాత చాంపియన్ అయిన బెంగళూరు

18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి మరి… ఛాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే విజయం సాధించిన తర్వాత.. చిన్న స్వామి స్టేడియం దగ్గర

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×