BigTV English

Rajamouli: అనుష్క నాతో రొమాన్స్ చేయించింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి

Rajamouli: అనుష్క నాతో రొమాన్స్ చేయించింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి
Advertisement

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి  చేసింది జక్కన్ననే. ఆయనతో సినిమా చేయాలను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతుంటారు. ఇక జక్కన్న మాత్రం.. తనకు హిట్స్ ఇచ్చిన హీరోలతో హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేయాలని చూస్తుంటాడు. ఇక ప్రతి ఒక్క డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ వేరు గా ఉంటుంది.


 

అలాగే ప్రతి ఒక్క హీరోది, హీరోయిన్ వర్క్ వేరుగా ఉంటుంది. కొంతమంది డైలాగ్స్ చదివి ప్రాక్టీస్ చేసి చెప్తారు. ఇంకొందరు వెనుక ప్రాంప్టింగ్ ఇస్తే చెప్తారు. ఇక కొందరు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు. మరి కొందరు డైరెక్టర్ ఆ సీన్ లో ఇలా చేయాలని చేసి చూపిస్తే తప్ప సీన్ చేయరు. ఇక లేడీ సూపర్ స్టార్ అనుష్క కూడా చివరి కేటగిరి కి చెందిందని రాజమౌళి చెప్పడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో  అనుష్క మూడు సినిమాలు చేసింది. విక్రమార్కుడు. బాహుబలి, బాహుబలి 2. ఇక ఈ మూడు సినిమాలు కూడా అనుష్కకు భారీ విజయాలను అందించాయి. అయితే విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క, రాజమౌళిని ఒక ఆట ఆడుకుందట.


 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని బయటపెట్టాడు. విక్రమార్కుడు సినిమాకు స్వీటీ ఒక ఆట ఆడుకోవడం మాత్రమే కాదు నాతో రొమాన్స్ కూడా చేయించింది అని చెప్పుకొచ్చాడు. “అనుష్కకు ఒక అలవాటు ఉంది. సీన్ చెప్పినా, అర్థమయ్యినా ఆమె వెంటనే చేయదు. డైరెక్టర్ చేసి చూపిస్తే అలానే చేస్తాను అని చెప్పేది. దానివలన సీన్ పర్ఫెక్ట్ గా వస్తుందని అనుకుంటుంది. ఇక విక్రమార్కుడు సినిమా సమయంలో ప్రతి సీన్ ను నేనే చేసి చూపించేవాడిని. ఇక చివరికి రొమాన్స్ కూడా నాచేత చేయించింది. రవితేజ, అనుష్క మధ్య నడుము గిల్లే సీన్ ఉంటుంది. దానికి అలా వంగితే రవితేజ వచ్చి నడుము గిల్లుతాడు అని చెప్పినా కూడా మీరు చేసి చూపించండి అని చెప్పింది. ఇక చేసేది లేక ఆ రొమాన్స్ సీన్ కూడా నేనే చేసి చూపించాను. అలా నాతో రొమాన్స్ చేయించింది” అని చెప్పుకొచ్చాడు.

 

ఇక స్వీటీ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తుందని, కానీ.. సెట్ లో ఆమె నవ్వితే ఆపడం కష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనుష్క వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో ఘాటీ సినిమాతో ఈ నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా కన్నడలో ఒక సినిమా చేస్తున్న స్వీటీ.. తమిళ్ లో కార్తీ సరసన ఖైదీ 2 లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక రాజమౌళి విషయానికొస్తే.. మహేష్ బాబుతో కలిసి SSMB29 సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో జక్కన్న ఎన్ని రికార్డులను బద్దలుకొడతాడో చూడాలి.

Related News

Mithra Mandali : బన్నీ వాసు కావాలనే కామెంట్ చేశారా?

Telusu Kada : తెలుసు కదా మూవీ స్టోరీ, ఇదే ఆ కొత్త పాయింట్

Dude Movie Story : ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా కంప్లీట్ మూవీ స్టోరీ ఇదే

Mega 158 : బాబీ సినిమాలో మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళం బ్యూటీ 

Nagarjuna 100: నాగార్జున లాటరీ కింగ్ నుంచి టబు ఔట్.. రేస్ లోకి మరో స్టార్?

Siddu Jonnalagadda : చేతిలో మైక్ ఉంటే… ఊమనైజర్ కామెంట్స్‌పై హీరో సిద్దు ఘాటు కౌంటర్

Mithra Mandali: మిత్రమండలి పై లిటిల్ హార్ట్స్ ఫార్ములా .. వర్కౌట్ అయ్యేనా?

Meesala Pilla : మీసాల పిల్ల పాట వచ్చేసింది, మెగా ఫ్యాన్స్ కి కావాల్సిందే ఇదే

Big Stories

×