BigTV English

Mohammed Siraj : సిరాజ్ హోటల్ లో హైదరాబాద్ ఫుడ్… ధరలు ఎలా ఉన్నాయంటే ?

Mohammed Siraj : సిరాజ్ హోటల్ లో హైదరాబాద్ ఫుడ్… ధరలు ఎలా ఉన్నాయంటే ?
Advertisement

Mohammed Siraj :   టీమిండియా క్రికెటర్లు ఈ మధ్య క్రికెట్ ఆడటంతో పాటు సైడ్ బిజినెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో క్రికెటర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్లు జాతీయ జట్టుకు ఆడుతూనే మరోవైపు ఐపీఎల్ లీగ్ లో దుమ్మురేపడం మనం ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇక అదే సమయంలో కొన్ని యాడ్స్ లో నటిస్తూ కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులతో కొన్నింటిని వ్యాపారాల్లో భాగస్వాములు అవ్వడం లేదా కొత్త బిజినెస్ ప్రారంభించడం లాంటివి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు మన మియా.. ప్రారంభించిన బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read :  Watch Video : ఒరేయ్ ఏంట్రా ఇలా తయారయ్యారు.. బకెట్ తో క్యాచ్ లు పడుతున్నారుగా

సిరాజ్ కొత్త బిజినెస్ షురూ.. 


హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ మహ్మద్ సిరాజ్ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. జొహార్బా పేరుతో ఒక కొత్త ప్రీమియం రెస్టారెంట్ ను ప్రారంభించాడు సిరాజ్. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో గల ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో మొఘలాయి, పర్షియన్ తో పాటు, అరేబియన్, చైనీస్ లాంటి విభిన్న రకాల వంటకాలను సిద్ధం చేశారు. హైదరాబాద్ వాసులకు స్పెషల్ గా ముఖ్యంగా ఈ రెస్టారెంట్ లో చికెన్ కబాబ్, చికెన్ ఫ్రైడ్, మటన్ ఫ్రైడ్ వంటివి ఇలా  అన్ని మసాలా ఫుడ్ లభించనుంది. అయితే సిరాజ్ హోటల్ లో 400 రూపాయల నుంచి స్టార్టింగ్.. ఇక  ఈ విషయాన్ని ఇటీవల సిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులో రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం సిరాజ్ ఇంగ్లాండ్ సిరీస్ లో బిజీ బిజీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

సిరాజ్  పై ట్రోలింగ్స్.. 

ఇప్పటికే టీమిండియా తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బౌలింగ్ బలంగా ఉండాలని భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్  పై బౌలింగ్ వికెట్ తీయకపోవడం పై ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఒరేయ్ నువ్వు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు.. 15 ఓవర్లు వేశావు.. ఏమైనా నీ వల్ల టీమిండియా కు లాభం ఉందా..? టైమ్  వేస్ట్ చేయకుండా బౌలింగ్ చెయ్… ఇంగ్లాండ్ బ్యాటర్లతో బ్యాటింగ్ చేయడం ఏంటి ? కొంచెమైనా బుద్ధి ఉందా ? అంటూ మహమ్మద్ సిరాజ్ పైన దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.  ఇక మరి కొంత మంది మహమ్మద్ సిరాజు డిఎస్పి డ్యూటీ ఎక్కాడని… సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు.  బౌలర్ మహ్మద్ సిరాజ్ పై ఇలా ట్రోలింగ్స్ చేస్తుండటంతో ప్రాక్టీస్ గట్టిగానే చేస్తున్నాడు. రెండో టెస్టులో తన ప్రతిభను కనబరుస్తాడో లేదో వేచి చూడాలి మరీ.

Related News

No-Handshake: టీమిండియాను ర్యాంగింగ్‌ చేసిన ఆసీస్ ప్లేయర్లు..పాకిస్థాన్ కు స‌పోర్ట్ చేస్తూ

RCB IPL 2026 Auction: RCB నుంచి 10 మంది ప్లేయ‌ర్లు ఔట్‌..లిస్టులో కోహ్లీ కూడా ?

Womens World Cup 2025: భారత్ సెమీస్ వెళ్లాలంటే ఎలా…ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెల‌వాలి?

Mohammed Shami: అగార్కర్, గంభీర్ ఇద్దరూ దొంగలే..నా కెరీర్ నాశనం చేస్తున్నారు

Gautam Gambhir: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి అస్స‌లు తీసుకోను…కోహ్లీ, రోహిత్ కు షాకిచ్చిన గంభీర్‌!

HCA Controversy: HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం…ముస‌లి వాళ్ల‌ను కుర్ర క్రికెట‌ర్లు అంటూ !

Suryakumar Yadav: బాలీవుడ్ హీరోయిన్ తో సీక్రెట్ గా గుడికి వెళ్లిన‌ సూర్య కుమార్..!

Sara Tendulkar: అర్జున్ టెండూల్కర్ కాబోయే భార్యతో సారా నైట్ పార్టీ.. ఫోటోలు వైరల్

Big Stories

×