Singer Kumar sanu: సంగీతం(Music) అంటే ఆసక్తి ఉన్నవారికి సింగర్ కుమార్ సాను(Kumar Sanu) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుమార్ సాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఎన్నో అద్భుతమైన మెలోడీ పాటలు పాడి ఎంతోమందిని ఆకట్టుకున్న ఈయనను “మెలోడి కింగ్”(Melody King)అని కూడా పిలుస్తారు. ఇక ఈయన సినీ నేపథ్యంలో ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఒకేరోజు అత్యధిక పాటలను రికార్డు చేసిన వ్యక్తిగా కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు.
కార్డెక్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో..
ఇలా ఎంతో మంచి ఆదరణ ఉన్నటువంటి కుమార్ సాను ఇప్పటికి ఎన్నో మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ (live concert)కార్యక్రమాలను నిర్వహించారు. అయితే త్వరలోనే హైదరాబాదులో కూడా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది హైదరాబాద్ లో కార్డెక్స్ గ్రూప్(Cardex Group
) ఆధ్వర్యంలో ఈ లైవ్ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని జులై 26 2025వ తేదీ హైదరాబాదులోని క్లాసిక్ కన్వెన్షన్ 3, శంషాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కార్డెక్స్ గ్రూప్స్ పలు పోస్టర్లను విడుదల చేశారు.
బుక్ మై షో..
ఈ సంగీత కచేరికి అందరూ ఆహ్వానితులే అంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేయడమే కాకుండా పూర్తి వివరాలను కూడా తెలియజేశారు ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు ముందుగానే బుక్ మై షో (Book My Show)ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ కార్డెక్స్ గ్రూప్స్ ఎం.డీ జయరాం రెడ్డి మాట్లాడుతూ.. “హైదరాబాద్ వినోద రంగంలో కొత్త ప్రమాణాన్ని సృష్టించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. సింగర్ కుమార్ సాను అద్భుతమైన ప్రతిభకు మా ప్రొడక్షన్ విలువలతో ఈ కన్సర్ట్ అభిమానులకు ఒక గొప్ప అనుభూతిగా, అనుభవంగా నిలుస్తుందని జయరాం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
అద్భుతమైన రాత్రి…
ఇంతటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని ముందుగానే మీ టికెట్లు బుక్ చేసుకొని సిద్ధంగా ఉండమని తెలియజేశారు. ఈ లైవ్ కన్సర్ట్ లో భాగంగా ఆధునిక సౌండ్, లైటింగ్ మరియు స్టేజ్ డిజైన్ ప్రత్యేక MIP అనుభవాలు, ఎర్లీ బర్డ్ ఆఫర్లు ఎంతో అద్భుతమైన ఈ ప్రదర్శనతో కచ్చితంగా మీ మనసు మైమరిచిపోతుందనీ, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలని తెలిపారు. ఇక ఈ వేదికపై లెజెండరీ సింగర్ కుమార్ సాను అద్భుతమైన గాత్రంతో ఎంతో అద్భుతమైన పాటలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయటానికి సిద్ధమయ్యారనే చెప్పాలి.
Also Read: తమన్నా నా వల్లే హీరోయిన్ అయింది.. ఆమెకు ఆ కృతజ్ఞత లేదు