Herbal Oil for Long Hair: జుట్టు విపరీతంగా ఊడిపోతుందని బాధపడుతున్నారా? ఎన్ని రకాల షాంపులు,హెయిర్ ఆయిల్స్ ట్రై చేసినా.. జుట్టు రాలడం మాత్రం ఆగట్లేదా? అయితే ఒకసారి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి. మీ జుట్టు ఫాస్ట్‌గా పెరుగుతుంది. అంతేకాదు జుట్టుకూడా నల్లగా మారుతుంది. ప్రస్తుత రోజుల్లో జుట్టురాలడం అనేది సర్వ సాధారణంగా మారింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ముఖ్యంగా మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు వాడటం వల్ల.. జుట్టురాలే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికి శాశ్వత పరిష్కారం ఆ హెయిర్ ఈయిల్.. జుట్టు ఫాస్ట్‌గా, ఒత్తుగా పెరిగేలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు తెల్లజుట్టు సమస్యలను, చుండ్రును దూరం చేయడంలో సహాయపడుతుంది. మరి ఆలస్యం చెయ్యకుండా.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఆవాలు
మెంతులు
మందారం ఆకులు
మందారం పువ్వులు
ఉల్లిపాయలు
తులసి ఆకులు
కరివేపాకు
గోరింటాకు
కలబంద
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని.. అందులో కావాల్సినంత కొబ్బరి నూనె , ఆవాలు, కరివేపాకు, మెంతులు, మందారం ఆకులు, మందారం పువ్వులు, తులసి ఆకులు, తురిమిన ఉల్లిపాయలు, గోరింటాకు, కలబంద ముక్కలు, వేసి 20 నిమిషాలపాటు మరిగించండి. స్టవ్ కట్టేసి, కాసేపు చల్లారనిచ్చి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకుదుళ్లకు అప్లై చేయండి. జుట్టు ఫాస్ట్‌గా, పెరుగుతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టుపెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
జుట్టు పొడవుగా పెరిగేందుకు.. ఈ హెయిర్ ఆయిల్ కూడా ట్రై చేయండి. మీ జుట్టు పెరుగుదలను ఎవరు ఆపలేరు..
కావాల్సిన పదార్ధాలు
కలోంజీ సీడ్స్
మెంతులు
ఉల్లిపాయలు
కరివేపాకు
కొబ్బరి నూనె
బాదం నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో మెంతులు, కలోంజీ సీడ్స్ వేసి 10 నిమిషాలపాటు దోరగావేయించి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే స్టవ్‌పై కడాయి పెట్టుకుని.. అందులో కప్పు బాదం నూనె, కప్పు కొబ్బరి నూనె, తయారు చేసుకున్న పొడి వేసి మరిగించాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. 20 నిమిషాలపాటు మరిగించాలి. అంతే హెయిర్ ఆయిల్ తయారు అయనట్లే.. ఈ ఆయిల్ కొద్దిరోజులపాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు జుట్టుకు ఈ నూనెను పెట్టుకుని మాసాజ్ చేసి.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. జుట్టు ఊడిన చోటే మళ్లీ పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్యలను కూడా తొలగిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Also Read: ఒక్క రాత్రిలో మీ ముఖం తెల్లగా మారాలా? అయితే ఈ రెమిడీ మీకోసమే..
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.