Swayambhu: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) తాజాగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. యోధుడి పాత్రలో.. యుద్ధరంగంలో కదం తొక్కిన యోధుడిగా కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరించబోతున్నారు. కత్తి చేత పట్టి వీర విహారం చేసిన ఆ యోధుడి విజయ్ పరంపర ఎలా సాగింది? ఆ యుద్ధం ఎందుకోసమో తెలియాలి అంటే ఈ స్వయంభూ (Swayambhu ) సినిమా చూడాల్సిందే. భరత్ కృష్ణమాచార్య (Bharath Krishnamacharya) దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon), నభా నటేష్ (Nabha Natesh).హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్వయంభూ..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో నిఖిల్ హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం పై భువన్, శ్రీకర్.. అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందని.. రూ.60 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నిఖిల్ కెరియర్ లోనే ఇది ఖరీదైన ప్రాజెక్టుగా మారింది అని సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
ఆ సినిమాను తలపిస్తున్న రాజేంద్రప్రసాద్ పాత్ర..
ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ పూర్తి అవడంతో.. ఇందులో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) పాత్ర కూడా వైరల్ గా మారింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ హనుమంతుడు పాత్ర పోషిస్తున్నారట. ఇక ఈ పాత్ర తెలియడంతో గతంలో పృథ్వీ, రాశీ కాంబినేషన్లో వచ్చిన ‘దేవుళ్ళు’ సినిమా గుర్తు చేస్తోందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దేవుళ్ళు సినిమాలో రాజేంద్రప్రసాద్ హనుమంతుడు పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే పాత్రలో స్వయంభూ సినిమాలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు రాజేంద్రప్రసాద్ పాత్ర పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది..
నిఖిల్ కెరియర్..
నిఖిల్ కెరియర్ విషయానికి వస్తే ‘హ్యాపీడేస్’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈ సినిమా కంటే ముందు ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ‘అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్’ అనే సినిమాతో సోలో హీరోగా కెరియర్ మొదలుపెట్టి.. యువత, వీడు తేడా వంటి చిత్రాలలో నటించారు. చివరిసారిగా కార్తికేయ2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. స్పై, 18 పేజెస్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో డిజాస్టర్ ను చవిచూశారు. ఇక ఇప్పుడు స్వయంభూ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ:Nirupam Paritala: నిరుపమ్ తండ్రి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?