Juice For Hair Growth: జుట్టు రాలడం, పలచబడటం అనేవి ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు. ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో మనం కొన్ని రకాల జ్యూస్‌లను తాగడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని మీకు తెలుసా ? సరైన పోషకాలతో నిండిన పండ్ల, కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో.. దాని మందాన్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఇంతకీ జుట్టు పెరుగుదలకు ఏ జ్యూస్‌లు ఉత్తమమో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్యారెట్ జ్యూస్:
క్యారెట్లు బీటా-కెరోటిన్ అనే విటమిన్ A తో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A ఆరోగ్యకరమైన తలకు, జుట్టుకు అత్యవసరం. ఇది స్కాల్ప్‌లో సెబమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును తేమగా ఉంచి.. పొడిగా మారకుండా కాపాడుతుంది. అంతేకాకుండా.. క్యారెట్లలో విటమిన్ సి, కె, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. రోజూ ఒక గ్లాసు క్యారెట్ రసం తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది.
2. ఉసిరి జ్యూస్ (ఆమ్లా జ్యూస్):
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. కొల్లాజెన్ జుట్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. అంతే కాకుండా తెల్లజుట్టు రాకుండా నివారిస్తుంది. ఉసిరి జ్యూస్ నేరుగా తాగవచ్చు లేదా ఇతర పండ్ల రసాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.
3. పాలకూర జ్యూస్ :
పాలకూర ఐరన్, ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఐరన్ లోపం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. పాలకూర రసం ఐరన్ లోపాన్ని నివారించి.. జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫోలేట్ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
Also Read: వీళ్లు.. టమాటో అస్సలు తినకూడదు తెలుసా ?
4. బీట్‌రూట్ జ్యూస్:
బీట్‌రూట్‌లో ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరచి.. జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా బీట్‌రూట్ జ్యూస్ తలకు రక్త ప్రవాహాన్ని పెంచి.. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
5. అలోవెరా జ్యూస్:
అలోవెరా జ్యూస్ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇవి స్కాల్ప్‌లోని మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది జుట్టు కుదుళ్లను అడ్డుకుంటుంది. స్కాల్ప్ pH సమతుల్యతను కూడా పునరుద్ధరిస్తుంది. జుట్టు పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి స్కాల్ప్ వాపును తగ్గించడంలో సహాయపడతాయి.