Telugu film industry: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ తో కనీసం 10 సినిమాలు తీసే అవకాశం ఉంది. సినిమాల మీద పెట్టే బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలానే తెలుగు సినిమా 100 కోట్ల మార్కెట్ చూడడమే గగనం అనుకున్న తరుణంలో నేడు 1000 కోట్లు మార్కెట్ కూడా చూస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్థాయిలో ఎదిగింది దానిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి.
ఈ తరుణంలో సినిమా కార్మికులకు వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే స్పందించింది. ఇక దీనిని సినిమా కార్మికులు ఎలా తీసుకొని స్పందిస్తారో వేచి చూడండి.
తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందన
ప్రియమైన నిర్మాతలకు,
ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం, నైపుణ్యం ఉన్నవారికి మరియు లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాము. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాము.
ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతుంది. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాము.శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి. ఇంకా వివరాలు త్వరలో తెలియజేయబడతాయి. అంటూ తిరిగి ఫిలిం ఛాంబర్ ఒక నోట్ రిలీజ్ చేసింది.
ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం
ఇప్పుడు అదనపు వేతనాల భారం
ఓ టి టి శాటిలైట్స్ అగమ్య గోచరం
పైరసీ పుండు మీద కారం
పేరుకే వినోద పరిశ్రమ
నిర్మాతల శ్రమ విషాదమే— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 3, 2025
నిర్మాత ఎస్ కే ఎన్ స్పందన
ఈ విషయంపై నిర్మాత ఎస్ కే ఎన్ స్పందిస్తూ…
ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం
ఇప్పుడు అదనపు వేతనాల భారం
ఓ టి టి శాటిలైట్స్ అగమ్య గోచరం
పైరసీ పుండు మీద కారం
పేరుకే వినోద పరిశ్రమ
నిర్మాతల శ్రమ విషాదమే
అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కూడా పలు రకాల విమర్శలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. కోట్లలో హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. కార్మికుల జీతాలు పెంచడానికి మీకు ఏమైంది అంటూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇక వీటిపై తెలుగు ఫిలిం చాంబర్ తన ఆలోచనను మార్చుకొని ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.