Healthy Bones Diet| శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండడం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గి, గాయాలు, ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడే ఒక వ్యాధి) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తప్పు ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, విటమిన్ లోపం ఈ సమస్యను మరింత పెంచుతాయి. అయితే, సరైన ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా ఉండటమే కాకుండా, కొత్త ఎముకలు ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలకు చాలా అవసరం.
న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి, హీలింగ్ టచ్ క్లినిక్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ వైష్ అభిప్రాయం ప్రకారం.. “భారతదేశంలో మనకు ఎముకల బలాన్ని పెంచే అనేక ఆహారాలు సులభంగా లభిస్తాయి. సరైన ఆహార ప్రణాళిక ఎముకల ఆరోగ్యానికి కీలకం,” అని చెప్పారు. బలమైన ఎముకల కోసం ఆయన సూచించిన భారతీయ ఆహార గైడ్ మీ కోసం.
1. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు
ఎముకల బలానికి కాల్షియం చాలా ముఖ్యం. పెద్దవారికి రోజుకు 1000–1200 మి.గ్రా కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో కాల్షియం లభించే ఆహార పదార్థాలు:
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ
ఆకుకూరలు: పాలకూర, మెంతి, చౌలాయ్
నువ్వులు: తిల్ గింజలు
రాగి: రాగి జావ, రొట్టెలు డాక్టర్ వైష్ సలహా.. “రోజూ ఒక గ్లాస్ పాలు లేదా ఒక గిన్నె పెరుగు తీసుకుంటే కాల్షియం అవసరాలు సులభంగా తీరుతాయి.”
2. విటమిన్ డి
కాల్షియం శరీరంలోకి ఇమిడేందుకు విటమిన్ డి అవసరం. ఉదయం 20 నిమిషాలు ఎండలో గడిపితే విటమిన్ డి సహజంగా లభిస్తుంది. ఆహారంలో విటమిన్ డి :
సొనలు, సార్డినెస్ వంటి చేపలు
గుడ్డు సొన
పాల ఉత్పత్తులు
పుట్టగొడుగులు
“ఎండలో కాసేపు గడపడం ఎముకల బలానికి చాలా ముఖ్యం,” అని డాక్టర్ వైష్ చెప్పారు.
3. ప్రోటీన్
ఎముకల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. భారతీయ ఆహారంలో ప్రొటీన్ లభించే సులభమైన ఆహార పదార్థాల జాబితా
పప్పులు (దాల్, రాజ్మా, చనా, మూంగ్)
పాల ఉత్పత్తులు
గింజలు (బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్‌సీడ్స్)
గుడ్లు, సన్నని మాంసం “ప్రోటీన్ ఎముకల బలాన్ని పెంచి, గాయాల నుంచి రక్షిస్తుంది,” అని డాక్టర్ వైష్ తెలిపారు.
4. మెగ్నీషియం, ఫాస్ఫరస్
ఎముకల నిర్మాణానికి ఈ ఖనిజాలు కూడా అవసరం. ఇవి లభించే ఆహారాలు:
అరటిపండ్లు, అంజీర్, ఖర్జూరం
బ్రౌన్ రైస్, ఓట్స్
కాజు, వేరుశనగ
గుమ్మడి, సన్‌ఫ్లవర్ గింజలు
ఈ ఆహారాలు నివారించండి
కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయి. వీటిని తగ్గించాలని డాక్టర్ వైష్ సూచించారు. అందుకే వీటిని తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.
చక్కెర ఉన్న డ్రింక్స్ (ఎనర్జీ డ్రింక్స్, ఇతర బెవరెజెస్ )
సాఫ్ట్ డ్రింక్స్
అధిక ఉప్పు (మితంగా తినాలి)
అతిగా కెఫీన్ (టి, కాఫీ- మితంగా తాగాలి)
Also Read: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ చాటుగా ప్రవేశించిన బాస్.. ఆమె రాగానే అండర్‌వేర్‌లో..
“వాకింగ్, జాగింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు జీవితాంతం బలంగా ఉంటాయి,” అని డాక్టర్ వైష్ సలహా ఇచ్చారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం ఈ సులభమైన ఆహార మార్పులతో ఎముకలను బలోపేతం చేసుకోండి.