E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘తలైవర్ 173’ డైరెక్టర్స్ మారడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!

‘తలైవర్ 173’ డైరెక్టర్స్ మారడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!
Advertisement

Thalaivar173 Director Change: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘Thalaivar173’ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడిగా అశ్వత్ మారిముత్తు ఫిక్స్ అయినట్లు స్వయంగా రజనీకాంత్ (ధర్మన్) వెల్లడించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి ముందు ముగ్గురు దర్శకులు మారిన వృత్తాంతాన్ని ఆయన పంచుకున్నారు.

Read also-“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

ఆయన మాటల్లోనే…

Advertisement

“Thalaivar173 చిత్రానికి అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు. మొదట మేము కేఎస్ రవికుమార్ గారిని అనుకున్నాం. ఆ తర్వాత సుందర్ సి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు, కానీ ఆయనకు ఇతర కమిట్‌మెంట్లు ఉండటం వల్ల కుదరలేదు.” ఈ ప్రాజెక్ట్ లోకి మూడో దర్శకుడిగా ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి ఎంట్రీ ఇచ్చారని, కానీ ఒక భారీ కథాంశం వల్ల ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి వాయిదా పడిందని రజనీకాంత్ తెలిపారు. అందుకే ముగ్గురు దర్శకులు మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో దర్శకులు మారడానికి గల కారణం ఎంటా అని ఆరా తీస్తున్న వారికి అసలు విషయం తెలిసింది.

అంతే కాకుండా సిబి చక్రవర్తి చెప్పిన కథలో బారీ ఉందని, ఈ కథ గురించి కూడా చెప్పుకొచ్చరు. ఈ స్టోరీ న్యూక్లియర్ సైంటిస్ట్‌కు సంబంధించిన అత్యంత సెన్సిటివ్ సబ్జెక్ట్. ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి దేశాలలో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. పరిస్థితులు, కథలోని సెన్సిటివిటీని బట్టి ఈ సినిమాను కొంతకాలం ఆగి చేద్దామని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అని చెప్పుకొచ్చారు.

Advertisement

Read also-మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో జయం రవి.. పనిమనుషుల బంధించి..

లైన్లోకి అశ్వత్ మారిముత్తు..

సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడటంతో, ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు రంగంలోకి దిగారు. ఆయన చెప్పిన లైన్ నచ్చడంతో రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరికొత్త కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అటు రజనీ అభిమానుల్లో, ఇటు కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రజనీ కాంత్ ఇది వరకు సైంటిస్ట్ పాత్రలో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సారి డాక్టర్ పాత్రలో ఏం చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

వెండితెరపై ‘మీర్జాపూర్’ రచ్చ.. థియేటర్లలోకి కల్ట్ ఫ్రాంచైజీ!

“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!

మహేష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. షూటింగ్ బ్రేక్..?

Dharman Poster: డాక్టర్ అవతారంలో సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీకాంత్!

మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో జయం రవి.. పనిమనుషుల బంధించి..

‘రాఖ్’ వెబ్ సీరిస్.. గుండె బరువెక్కించే రియల్ స్టోరీ, 1978లో ఏం జరిగిందంటే..

Big Stories

×