E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Ram Charan Praise : ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!’ ఒక కొడుకు పుట్టినప్పుడు తండ్రికి కలిగే ఆనందం కంటే, ఆ కొడుకు సాధించిన విజయాలను చూసి సమాజం మెచ్చుకుంటున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఈ సత్యాన్ని అక్షరాలా నిజం చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి తన సుపుత్రుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఉద్దేశించి సాషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!

ప్రధాని నోట.. చరణ్ మాట!

Advertisement

ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” (New Age MegaStar) అని సంబోధించడం విశేషం. దేశ ప్రధాని నోట తన కొడుకు గురించి ఇంతటి గొప్ప మాట రావడంపై చిరంజీవి అత్యంత ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపుపై చిరంజీవి స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు..

‘ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా నా గుండె గర్వంతో నిండిపోతోంది. చరణ్ తన కఠోర కృషి, అంకితభావం, అద్భుతమైన నటనతో కేవలం ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా, ప్రపంచస్థాయిలో విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.’ అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Read also-Dharman Poster: డాక్టర్ అవతారంలో సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీకాంత్!

రామ్ చరణ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, ‘RRR’ సినిమాతో అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా పతాకాన్ని ఎగురవేశారు. రానున్న రోజుల్లో చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని చిరంజీవి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ ఎదుగుతుంటే, ఆ ఎదుగుదలను చూసి మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ఇప్పుడు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “నిజమైన పుత్రోత్సాహం అంటే ఇదే” అంటూ నెటిజన్లు కూడా చిరు, చరణ్‌లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Related News

‘తలైవర్ 173’ డైరెక్టర్స్ మారడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!

వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!

మహేష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. షూటింగ్ బ్రేక్..?

Dharman Poster: డాక్టర్ అవతారంలో సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీకాంత్!

మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో జయం రవి.. పనిమనుషుల బంధించి..

‘రాఖ్’ వెబ్ సీరిస్.. గుండె బరువెక్కించే రియల్ స్టోరీ, 1978లో ఏం జరిగిందంటే..

గ్లోబల్ బాక్సాఫీస్‌పై కార్తి దండయాత్ర.. ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Big Stories

×