E-Paper
Advertisement

Hyderabad: తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్, జాయినింగ్ కమిటీ ఏర్పాటు

Hyderabad: తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్,  జాయినింగ్ కమిటీ ఏర్పాటు
Advertisement

Hyderabad: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీలో చేరికలను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేశారు అధినేత పవన్ కల్యాణ్.

తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్

Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ వంటి పార్టీలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది.

క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మిగతా పార్టీల నుండి వచ్చే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దానికి తెలంగాణ జాయినింగ్స్ కమిటీని నియమించారు.

Advertisement

జాయినింగ్ కమిటీ ఏర్పాటు.. పబ్లిక్ సభలకు ప్లాన్

ముఖ్యంగా పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, మాజీ అధికారులు, తటస్థులను తీసుకొచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. తెలంగాణలో చేరికల విజ్ఞప్తులను తొలుత జాయినింగ్స్ కమిటీ పరిశీలిస్తుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు.

ఎన్నికల ముందు పొత్తు విషయం ఏమోగానీ కింది స్థాయిలో పార్టీని బలోపేత చేసే దిశగా జనసేన అడుగులు వేగంగా పడుతున్నాయి. అంతేకాదు అధినేత తో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలను మినీ సంగ్రామంగా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

ALSO READ: ‘SIR’ అంశంపై సీఎం రేవంత్ ఆగ్రహం.. పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ 

 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×