Coolie Sequel: ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా సింగిల్ సినిమాలా కాకుండా ప్రాంచైజీస్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకొని సీక్వెల్ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్నారు. ఇకపోతే త్వరలోనే రజినీకాంత్ (Rajinikanth)హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కూలీ(Coolie). ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ లోకేష్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
లోకేష్ తో రజిని మరో సినిమా?
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా లోకేష్ కనగరాజ్ ఈ సినిమా గురించి ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ రజనీకాంత్ గారు చూశారని తెలియజేశారు. అయితే సినిమా చూసిన తర్వాత ఆయన నాతో ఒకటే మాట చెప్పారు. మనం మళ్లీ కలిసి ఒక సినిమా చేద్దామని చెప్పినట్టు ఈ సందర్భంగా లోకేష్ తెలియజేశారు. ఇలా రజనీకాంత్ ఈ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బహుశా కూలీ సినిమాకు సీక్వెల్(Coolie Sequel) కూడా రాబోతుందేమోనని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సీక్వెల్ సినిమాపై కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
కూలీ సినిమా సీక్వెల్ ఉండనుందా?
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కూలీ సినిమాకు సరైన ప్రారంభం అలాగే ముగింపు ఉన్న నేపథ్యంలో కూలీ సీక్వెల్ ఉండబోదని ఈయన క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా భాగం కాదని కూడా ఈయన తెలియజేశారు. లోకేష్ కనగరాజ్ ఇప్పటికే పలు సినిమాలను తనలో సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే కూలీ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచింది అదేవిధంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు తెలుగు నటుడు నాగార్జున కూడా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే.
స్పెషల్ సాంగ్ లో తళుక్కుమన్న పూజ…
ఇక ఈ సినిమాలో శృతిహాసన్ నటించగా పూజా హెగ్డే మోనిక అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు. ఇప్పటికే ఈ పాటను విడుదల చేయగా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది. ఇక రజనీకాంత్ ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఈయన చివరిగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తదుపరి కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Rajinikanth: రజినీకాంత్ రోజు 2 గంటల పని చేస్తారా.. అసలు విషయం చెప్పిన లోకేష్ కనగరాజ్!