Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల జైలర్ సినిమా(Jailer Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..
ఇకపోతే ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఏమాత్రం భాగం కాదని ఈయన తెలియజేశారు. అదేవిధంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ నటుడు రజనీకాంత్ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ గారు ప్రతిరోజు రెండు గంటల పాటు తన విలువైన సమయాన్ని తన ఆటోబయోగ్రఫీ (autobiography) రాయడం కోసం ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. గత కొంతకాలంగా ఈయన ఈ పుస్తకాన్ని రాస్తున్నట్లు తెలిపారు.
రజనీకాంత్ జీవిత కథ..
కూలి సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆయన తన జ్ఞాపకాలను ఈ పుస్తకంలో రాస్తూ ఉండేవారని వెల్లడించారు. అయితే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురావడం కోసం రజనీకాంత్ ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. రజనీకాంత్ గారు ఇలా తన జీవిత కథను ఒక పుస్తకంలో రాస్తున్న విషయం ఎవరికీ తెలియదని తనకు మాత్రమే తెలుసని వెల్లడించారు. ఇక ఈ పుస్తకంలో మనం రజనీకాంత్ గారి జీవితంలో ఎప్పుడు వినని, చూడని సంఘటనలను కూడా తెలుసుకోబోతున్నామని లోకేష్ కనగరాజ్ తెలిపారు. అతి త్వరలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మార్కెట్లోకి కూడా తీసుకురాబోతున్నట్లు ఈయన తెలియజేశారు.
బస్ కండక్టర్ గా రజనీకాంత్…
ఇలా రజనీకాంత్ జీవితానికి సంబంధించిన పుస్తకం రాస్తున్నారు అంటే అందులో ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మొదలుకొని సినిమాలలో సాధించిన సక్సెస్ వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇక రజనీకాంత్ సినిమాలలోకి రాకముందు బస్ కండక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక రజనీకాంత్ ఏడుపదుల వయసులో కూడా సినిమాలపై ఆసక్తితో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ కూలీ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, శృతిహాసన్ వంటి తదితరులు నటించారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Sruthi Hassan: ఆ విషయంలో తమన్నా గ్రేట్.. ప్రశంసలు కురిపించిన శృతిహాసన్!