Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోతుంది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
మరో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చెరువులు నిండిపోతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లను తెరిచి నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు.
ఇబ్బందులు పడుతోన్న భాగ్యనగర వాసులు
హైదారాబాద్ నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీ వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోని ఇరుక్కుపోయిన సంఘటనలు ఎదురువుతున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. ఇక పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరుతుండడంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన ఏర్పడిన పరిస్థితి నెలకొంది.
ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు
ఇక.. ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు అక్కడ అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయతే ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ ఏపీపై పడుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ALSO READ: Government School: నా బిడ్డలు ఎక్కడ.. స్కూల్ బిల్డింగ్ కూలి ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లి ఆవేదన
ALSO READ: Railway Notification: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజుల సమయమే.. డోంట్ మిస్