BigTV English

Coolie Film: మారిపోయిన కూలీ.. కొత్త టైటిల్ ఇదే..కౌంట్ డౌన్ మొదలు!

Coolie Film: మారిపోయిన కూలీ.. కొత్త టైటిల్ ఇదే..కౌంట్ డౌన్ మొదలు!

Coolie Film: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)జైలర్ సినిమా తర్వాత కూలి సినిమా (Coolie Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. లోకేష్ డైరెక్షన్ అంటేనే సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే కూలి సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విడుదలకు కూడా సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు.


మజ్దూర్…

ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాకు చిన్న సమస్య ఎదురయిందని తెలుస్తుంది. పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు  సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు హిందీలో ‘కూలీ’ టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో ‘కూలీ’ అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉండటంతో అక్కడ ఈ సినిమాను ‘మజ్దూర్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఈ సినిమా టైటిల్ ను పూర్తిగా మార్చేసారని తెలుస్తుంది.


కూలీ – ది పవర్‌హౌస్..

ఈ సినిమాకు హిందీలో ‘కూలీ – ది పవర్‌హౌస్’ (Coolie-The Power House)అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలోనే  ఈ సినిమా కౌంట్ డౌన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మరొక 50 రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. కేవలం హిందీలో మాత్రమే ఈ సినిమా పేరులో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. మిగిలిన భాషలలో యధావిధిగా కూలీ పేరుతోనే విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది.

స్మగ్లింగ్ నేపథ్యంలో…

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ బంగారు స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్ల సమాచారం. అయితే ఈ సినిమా ఇదివరకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా విభిన్న చిత్రం అని తెలిపారు. ఇప్పటివరకు సినిమాటిక్ యూనివర్సల్ వచ్చిన సినిమాలన్నీ కూడా డ్రగ్స్ చుట్టూ తిరగగా ఈ సినిమా మాత్రం బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని డైరెక్టర్ లోకేష్ వెల్లడించారు.

Also Read: Kannappa 2: కన్నప్ప సీక్వెల్ ఉండబోతుందా? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ విష్ణు?

Related News

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తిరిగిన వాహనంపై కఠిన చర్యలు.. అసలేమైందంటే?

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Big Stories

×