BigTV English

Home Remedies For Ants: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లో ఒక్క చీమ కూడా ఉండదు తెలుసా ?

Home Remedies For Ants: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లో ఒక్క చీమ కూడా ఉండదు తెలుసా ?

Home Remedies For Ants: చీమలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తాయి. వీటి పట్ల కొంచెం అజాగ్రత్త ఉన్నా కూడా ఇల్లంతా తిరుగుతుంటాయి. వంటగదిలో ఉంచిన స్వీట్లు కావచ్చు లేదా డైనింగ్ టేబుల్ మీద ఉంచిన ఆహార పదార్థాలు కావచ్చు. పదార్థాలు ఏవైనా వాటి చుట్టూ అకస్మాత్తుగా చీమలు గుంపులు, గుంపులుగా వచ్చి చేరతాయి.


అయితే.. ఈ చీమలు కేవలం ఆహార పదార్థాలకే పరిమితం కావు. కొన్నిసార్లు మంచం, బట్టలు, అల్మారాల్లో కూడా చేరతాయి. వీటిలో ఉండే ఫార్మిక్ యాసిడ్ విషం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దీనివల్ల మంట, దురద వంటివి కూడా ఏర్పడతాయి. ఇలాంటి జరగకుండా , ఇంట్లో నుంచి చీమలను తరిమికొట్టడానికి ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోం రెమెడీస్:


వెనిగర్ స్ప్రే ఉపయోగించండి:
చీమలు ఫెరోమోన్ బాట గుండా వెళతాయి. ఈ బాటను తొలగించడానికి.. కిటికీలు, తలుపులు, మూలలు, చీమలు కనిపించే ప్రతిచోటా వెనిగర్, నీటిని సమాన పాళ్లల్లో తీసుకుని తయారు చేసిన ద్రావణాన్ని చల్లండి.ఇది చీమలు రాకుండా ఆపుతుంది.

ముఖ్యమైన నూనెలను వాడండి:
టీ ట్రీ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్, యూకలిప్టస్, లావెండర్ ఆయిల్ వంటి మొదలైన నూనెల యొక్క సువాసనను చీమలు ఇష్టపడవు. అందుకే వీటిని చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చల్లుకోవచ్చు.

నిమ్మరసం:
మీరు నిమ్మకాయ తొక్కలను నిల్వ చేసి.. వాటిని తలుపులు, కిటికీలు, ఇంటి మెయిన్ డోర్‌ల దగ్గర ఉంచండి. ఇవి ఇంటి నుంచి చీమలను దూరంగా వెళ్లడానికి సహాయపడతాయి.

దాల్చిన చెక్క, కాఫీ:
కాఫీ తయారు చేసిన తర్వాత.. మిగిలిన తడి కాఫీ పొడిని చీమలు కనిపించే చోట లైన్‌లో వేయండి. అయితే.. కాఫీ తడిగా ఉన్నంత వరకు మాత్రమే ఇది ప్రభావ వంతంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో.. ఆరిన తర్వాత హోం రెమెడీ ప్రయత్నించండి.

బేకింగ్ సోడా, చక్కెర:
పైన తెలిపిన రెండు పొడులను కలిపి చీమలు వెళ్లే మార్గాలపై చల్లండి. ఇది నెమ్మదిగా విషంలా పనిచేస్తుంది. చీమలు దానిని అవి గుంపులుగా ఉన్న చోటుకి తీసుకువెళతాయి. అక్కడ అన్ని చీమలు దానిని తిని కొన్ని గంటల్లో చనిపోతాయి.

కారం పొడి:
చీమలు వచ్చి వెళ్ళే చోట ఎర్ర కారం పొడి చల్లుకోండి. చీమలు కారం యొక్క ఘాటైన వాసన నుంచి దూరంగా ఉంటాయి.

Also Read: ముఖంపై మంగు మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

టాల్కమ్ పౌడర్:
టాల్కమ్ పౌడర్ వాసన చీమలకు నచ్చదు. అలాగే.. పౌడర్ పై నడవడం వల్ల వాటి ఫెరోమోన్ జాడ తొలగిపోతుంది.

వేడి నీరు:
మీరు చీమల గూడును కనుగొంటే.. దానిలో వేడి నీరు పోయాలి. ఇది వాటి మొత్తాన్ని నాశనం చేస్తుంది.

బోరాక్స్, చక్కెర:
బోరాక్స్ , పొడి చక్కెర మిశ్రమం చీమలకు ప్రాణాంతకం. బోరాక్స్ వాటికి నెమ్మదిగా విషంలా పనిచేస్తుంది. పని చేసే చీమలు దానిని ఆహారంగా భావించి తీసుకువెళతాయి. మిగిలిన చీమలు దానిని తిన్నప్పుడు, మొత్తం నశించిపోతాయి.

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×