BigTV English

Tvk Maanadu: విజయ్ మానాడు సభ పై రజనీకాంత్ రియాక్షన్, హీటెక్కుతున్న తమిళ రాజకీయాలు

Tvk Maanadu: విజయ్ మానాడు సభ పై రజనీకాంత్ రియాక్షన్, హీటెక్కుతున్న తమిళ రాజకీయాలు

Tvk Maanadu: తెలుగులో పవన్ కళ్యాణ్ మాదిరిగానే తమిళ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ పరిచయమే. శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తను చేసిన తుపాకీ సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా అప్పుడు విజయ్ హైదరాబాద్ కు వచ్చి మరి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.


విజయ్ తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ వచ్చింది. అయితే తన సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగులో విడుదలయ్యాయి కానీ ఏ రోజు తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ హైదరాబాద్ రాలేదు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా వారసుడు అనే తెలుగు సినిమా కూడా చేశాడు విజయ్. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా విజయ్ హైదరాబాద్ రాలేదు. ఒక ప్రస్తుతం విజయ్ ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటే మన వరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇకపై సినిమాలకు బ్రేక్ ఇస్తాడు అని కూడా వార్తలు వచ్చాయి.

విజయ్ భారీ సభ 


విజయ్ తమిళ వెట్రి కలగం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ పార్టీ మీటింగ్స్ కి విపరీతంగా జనాలు హాజరవుతున్నారు. నిన్న మధురైలో జరిగిన మానాడు సభకి విపరీతమైన జనం వచ్చారు. ఆ క్రౌడ్ చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. దీని గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. మానాడు సభ మంచి సక్సెస్ అయింది అంటూ రజనీకాంత్ మాట్లాడారు. అయితే విజయ్ మాట్లాడిన మాటలు అన్నీ మీరు గమనించారా అని జర్నలిస్ట్ అడిగినప్పుడు. నో కామెంట్స్ అని సూపర్ స్టార్ రజినీకాంత్ తప్పుకున్నారు. మరోవైపు విజయ్ స్పీచ్ పైన కొంతమంది కౌంటర్స్ కూడా ఇస్తున్నారు.

హీటెక్కుతున్న రాజకీయాలు 

ఎప్పుడూ తమిళ రాజకీయాలు మంచి హీట్ మీద ఉంటాయి. భారతదేశంలో తమిళ రాజకీయాల్లో ఉండే వేడి వాతావరణం వేరు. ఇక నిన్న విజయ్ స్పీచ్ లో కూడా చాలామందికి కౌంటర్స్ వేశాడు. ముఖ్యంగా స్టాలిన్ అంకుల్ అంటూ కూడా మాట్లాడారు. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ డైలాగులు కూడా చెప్పారు. విజయ్ స్పీచ్ మాత్రం హైలెట్. ఇక విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ జననాయగన్ (Jana Nayagan) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి హెచ్ వినోద్ (H Vinoth) దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read : Tollywood strike: షూటింగ్స్ అయితే మొదలయ్యాయి, కానీ మరో చిక్కొచ్చి పడింది

Related News

Tollywood strike: షూటింగ్స్ అయితే మొదలయ్యాయి, కానీ మరో చిక్కొచ్చి పడింది

SSMB29 : SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్, మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి

OG Movie: షూటింగ్ డిలే… పవన్ కళ్యాణ్ మూవీ వాయిదా?

SSMB29: దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య షూటింగ్ చేస్తున్న రాజమౌళి

Pradeep Ranganathan: సినీ చరిత్రలోనే ఫస్ట్‌టైం.. ఒకే హీరో.. ఒకే రోజు.. రెండు సినిమాలు రిలీజ్!

Big Stories

×