Bollywood:సినీ ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లే కాదు అప్పుడప్పుడు వారి భాగస్వామ్యలు చేసే వ్యాఖ్యలు కూడా వారిని వార్తల్లో నిలిచేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటుడి భార్య ప్రెగ్నెన్సీ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఆమె కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది .మరి ఆ బాలీవుడ్ నటుడు ఎవరు? ఆయన భార్య ప్రెగ్నెన్సీ గురించి ఎలాంటి కామెంట్లు చేసింది.. అసలు ఎందుకు అలాంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య, నటి పత్రలేఖ. త్వరలో ఈమె తల్లి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె..ఆసక్తికర విషయాలు పంచుకుంది. పత్రలేఖ మాట్లాడుతూ.. దాదాపు మూడు సంవత్సరాల క్రితం నేను నా అండాలను దాచుకున్నాను కానీ ఇప్పుడు వాటి సహాయం లేకుండానే సహజంగానే గర్భం దాల్చాను. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. దానికి బదులు సహజంగా గర్భం దాల్చడానికి ప్రయత్నించాలి. ఎగ్ ఫ్రీజింగ్ కంటే సహజ గర్భం సులభం” అంటూ అమ్మాయిలకు సూచించింది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే ఆరోగ్య అలవాట్లు చేసుకుంటే వివాహం తర్వాత గర్భధారణ సమయంలో ఏర్పడే సమస్యలను అధిగమించవచ్చు అని తెలిపింది పత్రలేఖ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ ఎంతోమంది అమ్మాయిలకు బెస్ట్ సలహాగా అనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రాజ్ కుమార్ రావు కెరియర్..
1984 ఆగస్టు 31వ తేదీన హర్యానా గుర్ గావ్ లో జన్మించారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి నటనలో శిక్షణ తీసుకున్న ఈయన.. 2010లో తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రన్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, ఈ సినిమాలో న్యూస్ రీడర్ గా కనిపించి కెరియర్ ను ఆరంభించారు. ఆ తర్వాత అదే ఏడాది షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి పేరు దక్కించుకున్నారు. హిందీలోనే ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈయన త్వరలో ‘మాలిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల స్త్రీ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను సంతోషపరుస్తున్నారు.
తండ్రి కాబోతున్న రాజకుమార్ రావు..
ఇక ఇంతలోనే ఇప్పుడు తండ్రి కాబోతున్నారని తెలిసి అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పత్ర లేక పాల్ విషయానికి వస్తే ఈమె కూడా నటి కావడం గమనార్హం.. హిందీ చిత్రమైన ‘సిటీ లైట్స్’ సినిమాతో రాజకుమార్ రావు తో కలిసి అరంగేట్రం చేసింది. 2010 నుంచే రాజకుమార్ తో బంధంలో ఉన్న ఈమె 2021 నవంబర్ 15న చండీగఢ్లోని ఒబెరాయ్ సుక్కు విల్లా రిసార్ట్ లో సాంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
ALSO READ:SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!