BigTV English

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం


Turakapalem Deaths: ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో గత కొన్ని రోజులుగా వరుసగా సంభవిస్తున్న అసాధారణ మరణాలు గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై సీఎం చంద్రబాబు .. స్పందించి  అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో పరిస్థితి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలకు హామి ఇచ్చారు. అధికారులు వీలైనంత త్వరగా మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు.

సీఎం చంద్రబాబు కీలక సూచనలు:


తురకపాలెంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ ఇంట్లో వంట చేసుకోవడం, లేదా స్థానిక తాగునీటిని ఉపయోగించడం వంటివి చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గ్రామం మొత్తానికి మూడు పూటలా ఉచితంగా ఆహారం ,సురక్షితమైన తా గునీటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇందుకు గల  ప్రత్యేక ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

మరోవైపు.. మరణాలకు గల కారణాలను కనుగొనడానికి వైద్య నిపుణుల బృందాలు విస్తృతంగా కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా.. 50 ఇళ్లకు ఒక బృందం చొప్పున ఏర్పాటు చేసి, గ్రామంలోని వంద శాతం ప్రజల రక్త నమూనాలను సేకరించాలని సీఎం ఆదేశించారు. అంతే కాకుండా వారం రోజుల్లోగా వ్యాధిని నిర్ధారించాలని గడువు విధించారు.

నీటి నమూనాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా లేదు:

మరణాలకు తాగునీరు కారణం కాదంటూ గ్రామీణ నీటిసరఫరా శాఖ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గ్రామంలోని ఆరు ప్రాంతాల నుంచి సేకరించిన 16 నీటి నమూనాలను రెండు పద్ధతుల్లో క్షుణ్ణంగా పరీక్షించారు. ఈ పరీక్షలలో పీహెచ్, టీడీఎస్, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ వంటి రసాయనాలతో పాటు, కోలిఫాం, ఈకోలి వంటి బ్యాక్టీరియాను కూడా చెక్ చేశారు. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగానే ఈ నమూనాల్లోని అంశాలు ఉన్నాయని, హానికారక ఈకోలి బ్యాక్టీరియా కూడా లేదని తేలింది. ఈ నివేదికతో నీటి వల్ల మరణాలు సంభవించలేదని స్పష్టమైంది.

మృతుల్లో రైతులు.. వ్యవసాయంపై అనుమానాలు:

ఇటీవల చనిపోయిన వారిలో 8 మంది రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురు పత్తి సాగు చేసేవారు. దీంతో మరణాలకు వ్యవసాయం, ముఖ్యంగా పురుగుమందుల వాడకం కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిపుణుల బృందాలు రైతుల పొలాల్లోంచి మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ ఫలితాలు ఈ నెల 14న వచ్చే అవకాశం ఉంది.

Also Read: రికార్డులు బ్రేక్.. బండ్లగూడ జాగీర్ లడ్డూ ఏకంగా రూ. 2.31 కోట్లు

నిర్లక్ష్యంపై విచారణ, బాధితులకు ఆర్థిక సహాయం:

మంత్రి సత్యకుమార్ గ్రామాన్ని సందర్శించి బాధితులను కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే మరణాల సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేర్చడంలో జరిగిన లోపంపై సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి.. అలాగే బాధితులు వైద్యం కోసం చేసిన ఖర్చులను సీఎం సహాయ నిధి ద్వారా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా చర్మం ద్వారా లేదా గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని ఆయన వివరించారు.

ప్రస్తుతం గ్రామంలో భయాందోళనలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం, అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంతో ప్రజలకు కొంత ధైర్యం లభించింది.

Related News

AP Liquor Scam: మిథున్ రెడ్డికి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jagan To Assembly: అసెంబ్లీకి వద్దులే.. సింపతీ వస్తే చాలులే

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Big Stories

×