BigTV English

SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!

SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!

SIIMA – 2025: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి “నేషనల్ అవార్డు” కూడా లభించింది. అంతేకాదు ఇందులో సిగ్నేచర్ డైలాగ్స్ “తగ్గేదేలే” అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఇలా ఒక్కటేమిటి ఈ సినిమాతో ఊహించని పాపులారిటీతో పాటు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యి మరో సంచలనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు అలాంటి సినిమా అటు సైమా అవార్డ్స్ లో కూడా సత్తా చాటుతోంది. “పుష్పగాడి రూల్ మళ్లీ మొదలైంది” అని నిరూపిస్తూ అవార్డుల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. మరి ఎవరికి ఏ విభాగంలో అవార్డు లభించిందో ఇప్పుడు చూద్దాం.


అవార్డుల వర్షం కురిపిస్తున్న పుష్ప..

సైమా అవార్డ్స్ 2025 వేడుక ప్రస్తుతం దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజే తెలుగు సినిమాలకు సైమా అవార్డులు అందివ్వడం జరిగింది. అందులో భాగంగానే పుష్ప 2 చిత్రానికి ఏకంగా నాలుగు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్టర్ (మేల్) విభాగంలో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోగా, ఉత్తమ నటి విభాగంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) అవార్డును దర్శించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad)అవార్డులను దక్కించుకున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ “SIIMA లో పుష్ప గాడి రూల్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


SIIMA – 2025 లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు..

ఇకపోతే దుబాయ్ లో జరుగుతున్న ఈ వేడుకలలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి అవార్డు లభించగా.. తేజ సజ్జ (Teja sajja), ప్రశాంత్ వర్మ(Prashanth Varma) కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ చిత్రానికి కూడా అవార్డు లభించింది.. ముఖ్యంగా ఉత్తమ సినిమాగా కల్కి 2898AD ఎంపికైంది. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా తేజా సజ్జ నిలవగా.. ఇదే విభాగంలో ఉత్తమ దర్శకుడుగా ప్రశాంత్ వర్మ అవార్డును దక్కించుకున్నారు. వీరందరికీ కూడా అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పుష్ప 2 సినిమా విశేషాలు:

పుష్ప సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. పుష్ప2: ది రూల్ అంటూ వచ్చిన ఈ సినిమా ఏకంగా ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో రిలీజ్ అయ్యి.. మొదటి రోజే రూ.294 కోట్లు వసూలు రాబట్టి భారత సినీ చరిత్రలో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించగా.. సుకుమార్ దర్శకత్వం వహించారు.

ALSO READ: Ashish Vidyarthi: పొట్టకూటి కోసం అలా చేయక తప్పలేదు -ఆశిష్ విద్యార్థి!

Related News

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Ghaati Collections : అనుష్క గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా.. ఏంటీ ఈ కలెక్షన్లు ?

Big Stories

×