Raju Weds Rambai First Day Collections: ఈ వారం డిజనుపైగా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో చెప్పుకోదగ్గ సినిమాలు మూడంటే మూడే. అవి మిడియం రేంజ్ హీరో సినిమాలే. అయితే ఇందులో భారీ ప్రమోషన్స్‌తో ఆడియన్స్ అటెన్షన్‌ని అందుకు చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇందులో అందరు దాదాపు కొత్త నటీనటులే. హీరో కొత్తవాడే. హీరోయిన్ మాత్రం కమిటీ కుర్రాళ్లు అలా అలా కనిపించింది. చిన్న సినిమా, కొత్త నటీనటులైన మూవీ టీం ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. పెద్ద సినిమా రేంజ్‌లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌ని ప్లాన్ చేశారు. అలా ప్రమోషన్స్‌తో మూవీపై భారీ హైప్ పెరిగింది. అలా ఎన్నో అంచనాల మధ్య నిన్న (నవంబర్ 21) ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
సినిమాకు టాక్ కూడా బాగానే వచ్చింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఆసక్తినెలకొంది. అయితే ఇక ప్రమోషన్స్‌లో డైరెక్టర్ సవాలు చూసి అంత ఆశ్చర్యపోయారు. ఈ చిన్న సినిమా బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో సౌండ్ చేస్తుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, అలా జరగకపోతే తాను బట్టలిప్పి తిరుగుతా అంటూ ఒపెన్ కామెంట్స్ చేశాడు. ఆయన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో అందరి దృష్టి మూవీపై పడింది. డైరెక్టర్ అంతలా సవాలు చేశాడంటే కంటెంట్‌లో దమ్ముండే ఉంటుందని ఆడియన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. అలా ప్రమోషన్స్ విపరీతమైన బజ్ నెలకొంది. దీంతో ఫస్ట్ డే మూవీకి ఓపెనింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని, చిన్న సినిమా ఊహించని వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేశాయి. సినిమాకు ఉన్న హైప్ చూసి వసూళ్లు కోటీపైనే రావోచ్చని ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తూ కనీసం కోటీ కూడా తగ్గలేదు. ప్రమోషన్స్, హైప్‌కి సంబంధం లేకుండ వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 78 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. అందరు కొత్త నటీనటులే అయినప్పటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. చిన్న సినిమాగా చూస్తే ఇవి సర్‌ప్రైజింగ్ కలెక్షన్స్. కానీ, రిలీజ్ కి ముందు సినిమాకు వచ్చిన బజ్, థియేటర్లలో వచ్చిన టాక్ పరంగా చూస్తే ఈ కలెక్షన్స్ చిన్నవే అంటున్నారు. మూవీ కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. మరీ ఈవీకెండ్స్‌లో అయినా వసూళ్లు పెంచుకుంటుందా అంటే అలా కూడా కనిపించడం లేదు. బుక్ మై షోలో ఏ థియేటర్లలో చూసి అన్ని గ్రీన్‌లో కనిపిస్తున్నాయి. పెద్దగా బుక్కింగ్స్ కూడా కనిపించడం లేదు. టాక్ పరంగా, కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ కొడుతుందని సవాలు చేసి దర్శకుడు పరిస్థితి ఏంటాని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరిపినట్లు ప్రమోషన్స్‌లో స్వయంగా మూవీ టీం చెప్పింది. అలా నటీనటులు పారితోషికం, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, నిర్మాణ, ప్రచార ఖర్చులు కలిసి రాజు వెడ్స్ రాంబాయి మూవీకి మొత్తం రూ. 3 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 3 కోట్ల షేర్, రూ. 6 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు నుంచి సమాచారం. మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి చేరుకుంటుందా? లేదా? చూడాలి.