E-Paper
Advertisement

ఒక్కో పాట ఓ సెన్సేషన్.. రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఇవే!

ఒక్కో పాట ఓ సెన్సేషన్.. రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఇవే!
Advertisement

Rakesh Master Superhit Songs:ఇప్పటి ఆడియన్స్ కి రాకేశ్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ గా కన్నా ఒక మీమర్ గానో ,లేక కాంట్రవర్సీ కామెంట్స్ చేసే వ్యక్తిగానో ఎక్కువ పరిచయం.కానీ ఆయన కెరీర్ లో సిల్వర్ జుబ్లీ పూర్తీ చేసుకున్న సినిమాలు ఉన్నాయని చాలా మందికి తెలీదు.రాకేశ్ మాస్టర్ విషయానికి వస్తే ..1968 లో జన్మించిన ఆయన హైదరాబాద్ లో ముక్కురాజు వద్ద శిష్యరికం చేశారు.ఇక ఆ తర్వాత కొన్ని వందల సినిమాలకి డాన్సర్ గా పని చేశారు

మరి రాకేశ్ మాస్టర్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ ఏంటో అవి ఏ సినిమాలోనివో మనమూ ఒక లుక్కేద్దాం!

Advertisement

నిన్నలా మొన్నలా లేదురా

ఇక ఆయన కొరియోగ్రాఫర్ గా చేసిన తొలిసినిమా వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన చిరునవ్వుతో సినిమా.ఈ సినిమాలోని ”నిన్నలా మొన్నలా లేదురా ..ఇవాళ కాలమే మారిపోయిందిరా”అనే పాటకి తొలిసారిగా డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు.ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలని చేసుకుంటూ పోయాడు.ఇక ఆయన కెరీర్ లో మరో మర్చిపోలేని సినిమా ‘మనసిచ్చాను’.2000లో రవితేజ, మణిచందన జంటగా వచ్చిన ఈ సినిమాలో ‘వెండితెరకు మా వందనాలు’ అనే పాటకి కొరియోగ్రఫీ చేయడమే కాకుండా ఒక డాన్సర్ గా ఇందులో కనిపిస్తాడు కూడా !

Advertisement

‘చందమామ కన్నా చల్లని వాడే’

ఇక మహేష్ బాబు నటించిన ‘యువరాజు’ సినిమాలోని ‘చందమామ కన్నా చల్లని వాడే’ పాటకు,అలాగే జగపతి బాబు నటించిన ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమాలోని ‘సొమ్ములే ఆదా చేయరా’ పాటకి కూడా కొరియోగ్రఫీ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక అప్పట్లో టీనేజ్ కుర్రకారుని ఒక ఊపు ఊపిన పాట ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలోని ‘నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ’ కి కూడా కొరియోగ్రఫీ అందించింది మన రాకేశ్ మాస్టరే.రోహిత్ హీరోగా వచ్చిన నటించిన ఈ సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

‘నేస్తమా ఓ ప్రియ నేస్తమా’

ముఖ్యంగా దర్శకుడు వైవీయస్ చౌదరి రాకేశ్ మాస్టర్ కి ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ అంతా ఇంతా కాదు.ఆయన దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో ‘నేస్తమా ఓ ప్రియ నేస్తమా’, ‘కళ్లలోకి కళ్లుపెట్టి’అంటూ రాకేశ్ మాస్టర్ చేసిన రెండు పాటలు ఎంతగా ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు.ఇక చౌదరి దర్శకత్వంలోనే వచ్చిన ‘సీతారామరాజు’ సినిమాలోని ‘ఎక్స్టసీ ప్రైవసీ’ పాటకు,అలాగే సీతయ్య సినిమాలోని పాటలకి రాకేశ్ మాస్టర్ చేసిన కోరియోగ్రఫీకి మంచి మార్కులే పడ్డాయి.

‘దేవదాసు’లోని అన్ని పాటలు 

ఇక ఇదే చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘దేవదాసు’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.సిల్వర్ జూబ్లి జరుపుకున్న ఈ సినిమాలో ‘బంగారం.. బంగారం’, ‘ఏయ్ బాబూ ఏంటి సంగతి’, ‘నువ్వంటేనే ఇష్టం’, ‘నిజంగా చెప్పాలంటే క్షమించు’, ‘పులుపంటే నాకిష్టం’..ఇలా సినిమాలోని అన్ని పాటలకి ఆయనే కొరియోగ్రఫీ అందించడం ఇక్కడ విశేషం.

also read :రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత తీసుకునేవారో తెలుసా?

ఇక ఇదే క్రమంలో రాజేంద్రప్రసాద్ నటించిన ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ సినిమాలోని అన్ని పాటలకు ,అలాగే వరం సినిమాలోని అన్ని పాటలకీ రాకేశ్ మాస్టారే కొరియోగ్రఫీ అందించడం మరో విశేషం.ఇవే కాకుండా ‘అమ్మో పోలీసోళ్లు అనే మరో సినిమాకి కూడా కొరియోగ్రఫీ అందించారు మన రాకేశ్ మాస్టర్!

Tags

Related News

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బానే డిమాండ్ చేశాడే?

జోరు పెంచిన మమితా బైజు.. సంక్రాంతి టార్గెట్ గా ‘హలో డియర్’!

త్రివిక్రమ్ గడ్డం వెనుక సీక్రెట్ ఇదేనా? ఇన్ని సమస్యలు ఉన్నాయా?

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీమ్..నాని ప్రత్యేక పూజలు!

రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత తీసుకునేవారో తెలుసా?

నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!

డీజే సౌండ్స్ పై శిరీష్ ఫిర్యాదు… అల్లు అర్జున్ పై భారీ ట్రోల్స్!

Big Stories

Advertisement
×