E-Paper
Advertisement

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!
Advertisement

How to Recover Deleted Contacts: మన ఫోన్లో ఉండే.. ముఖ్యమైన నంబర్లు లేదా కాంటాక్ట్స్ ఒక్కో సారి పొరపాటున డిలీట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు ఎవరైనా ముఖ్యమైన కాంటాక్ట్‌ను కోల్పోతే తీవ్రంగా టెన్షన్ పడుతుంటారు. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాపిల్ సంస్థ అందించే కొన్ని ప్రత్యేక ఫీచర్లు సింపుల్ సెట్టింగ్స్ సహాయంతో డిలీట్ చేసిన కాంటాక్ట్‌లను చాలా ఈజీగా. తిరిగి పొందొచ్చు. ఐఫోన్‌లో డిలీట్ అయిన నంబర్లను రికవర్ చేసుకునే ఆ అద్భుతమైన పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. ఐక్లౌడ్ ద్వారా కాంటాక్ట్‌లను రికవర్ :

యాపిల్ యూజర్లకు ఐక్లౌడ్ ఒక గొప్ప బ్యాకప్ టూల్. మీ ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు కాంటాక్ట్స్ ఆటో మేటిక్‌గా సింక్ అవుతుంటాయి. దీని కోసం మీ కంప్యూటర్ లేదా ఫోన్ బ్రౌజర్‌లో అధికారిక iCloud.com వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ యాపిల్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. హోమ్ పేజీలో కనిపించే ‘Data Recovery’ లేదా సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లండి. అక్కడ కింద వైపు ఉన్న ‘Restore Contacts’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.తర్వాత మీరు డిలీట్ చేసిన కాంటాక్ట్స్ ఆర్కైవ్స్ అక్కడ కనిపిస్తాయి. అందులో సరైన తేదీని ఎంచుకుని Restore బటన్ నొక్కండి. కొద్ది నిమిషాల్లో మీ ఐఫోన్‌లోకి ఆ కాంటాక్ట్‌లు మళ్లీ వచ్చేస్తాయి.

2. రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్ :

Advertisement

మీ ఐఫోన్‌లోని కాంటాక్ట్స్ యాప్‌లో నేరుగా.. ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది. మీరు ఏదైనా నంబర్‌ను డిలీట్ చేస్తే.. అది వెంటనే పూర్తిగా తొలగిపోదు.ముందుగా మీ ఐఫోన్‌లో Contacts యాప్ ఓపెన్ చేయండి. ఎడమ వైపు పైన ఉన్న Lists ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ ‘Recently Deleted’ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయండి. గత 30 రోజుల్లో డిలీట్ చేసిన కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. మీకు కావాల్సిన నంబర్‌ను సెలెక్ట్ చేసి ‘Recover’ ఆప్షన్ నొక్కితే సరి పోతుంది.

Also Read: మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

3. ఐక్లౌడ్ సింక్ టోగుల్ ట్రిక్:

Advertisement

కొన్ని సార్లు చిన్న టెక్నికల్ లోపాల వల్ల కాంటాక్ట్స్ కనిపించకపోవచ్చు. దీన్ని సరి చేయడానికి మీ ఐఫోన్ Settings ఓపెన్ చేసి పైన మీ ప్రొఫైల్ నేమ్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత iCloud ఆప్షన్‌కు వెళ్లండి.’Apps Using iCloud’ సెక్షన్‌లో Show All నొక్కి Contacts ఆప్షన్‌ను వెతకండి. ఒకవేళ ఆప్షన్ ఆన్ లో ఉంటే.. దాన్ని ఒకసారి Off చేసి, ఆపై కొన్ని సెకన్ల తర్వాత మళ్లీ On చేయండి. “Keep on My iPhone” లేదా “Merge” ఆప్షన్ అడిగితే Merge సెలెక్ట్ చేయండి. మీ కాంటాక్ట్స్ అన్నీ రీలోడ్ అవుతాయి.

4. జీమెయిల్ :

మీరు ఐఫోన్‌లో గూగుల్ లేదా అవుట్‌లుక్ వంటి థర్డ్ పార్టీ అకౌంట్‌ను సింక్ చేసి ఉంటే..ఆ అకౌంట్‌లో కూడా మీ కాంటాక్ట్స్ సేవ్ అయి ఉండే అవకాశం ఉంది.మీ ఫోన్ Settings -> Contacts -> Accounts కి వెళ్లి మీ మెయిల్ అకౌంట్‌లో కాంటాక్ట్స్ టోగుల్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆన్ చేయడం ద్వారా ఆ నంబర్లు సింక్ అవుతాయి.

Related News

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Big Stories

Advertisement
×