Rakesh Master Remuneration:రాకేశ్ మాస్టర్ …పరిచయం అక్కరలేని పేరు..ఈయన అసలు పేరు సీనూరి రామారావు.ఈయన 1968లో ఆంద్రప్రదేశ్లోని చిత్తూరులో జన్మించారు. ఇక ఇండస్ట్రీలో దాదాపు రెండు వందల సినిమాలకి పైగా పని చేసిన రాకేశ్ మాస్టర్ 2023 జూన్ 18న స్వర్గస్తులైన సంగతి తెల్సిందే.అయితే ఈయన చనిపోయే ముందు రెండు మూడేళ్ళు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ మీమర్స్ కి మాంచి స్టఫ్ అయ్యారు కాని, 90ల చివర్లో , 2000 సంవత్సరం మొదట్లో ఈయన చేసిన చాలా పాటలు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపాయి.
రాకేశ్ మాస్టర్ పారితోషికం ఎంత
ఒక రకంగా ఆ రోజుల్లో కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడనే చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో తన హవా కొనసాగిన ఆ రోజుల్లో రాకేశ్ మాస్టర్ పారితోషికం ఎంత ఉండి ఉండవచ్చన్న క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది. మరి రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి పారితోషికం ఎంత తీసుకుని ఉంటాడో చూసేద్దాం.
పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక్కో పాటకి దాదాపుగా
మాములుగా ఇండస్ట్రీలో ఒకే అమౌంట్ ఫిక్స్డ్ గా ఉండదు.వచ్చిన క్రేజ్,చేసిన పాటలు ఇలా ఒక్కో సినిమాకి మారిపోతూ ఉంటుంది.అలా చూస్తే రాకేశ్ మాస్టర్ పారితోషికం కూడా సినిమాని బట్టి, క్రేజ్ ని బట్టి మారినట్టు తెలుస్తుంది. దాని ప్రకారం రాకేశ్ మాస్టర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక్కో పాటకి దాదాపుగా 3 నుండి 6 లక్షల తీసుకున్నట్టు సమాచారం .అయితే ప్రత్యేక సందర్భాలలో ఈ పారితోశికం మరింత పెరిగేదని తెలుస్తుంది. ఇప్పుడంటే ఒక్కో పాటకి ఒక్కో పాటకి పదుల లక్షల్లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు కాని అప్పట్లో రాకేశ్ మాస్టర్ తీసుకున్న 3 నుండి 6 లక్షల పారితోషికమే ఎక్కువ అని చెప్పాలి.
బషీర్ అనే కంటెస్టెంట్ కి మాస్టర్ గా
ఇక రాకేశ్ మాస్టర్ సినిమాల విషయానికి వస్తే.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఆయన ‘చిరునవ్వుతో’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘యువరాజు’, ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘దేవదాసు’, ‘మనసిచ్చాను’ వంటి సినిమాల్లో ఆయన చేసిన కొరియోగ్రఫీకి మంచి పేరు వచ్చింది.ముఖ్యంగా దేవదాసు సినిమాలో నువ్వంటేనే ఇష్టం అనే పాట అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపేసింది.
ఇక తన శిష్యులు అయిన జానీ ,శేఖర్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్ లుగా,అలాగే చాలా మంది కొత్త వారు సినిమాలలో ఫుల్ బిజీ అయిపోవడంతో రాకేశ్ మాస్టర్ కి క్రమంగా సినిమాలు తగ్గిపోవడంతో డీ షోలో బషీర్ అనే కంటెస్టెంట్ కి మాస్టర్ గా వ్యవహరించారు.
రాకేశ్ మాస్టర్ ని మెచ్చుకొని తీరవలసిందే
ఇక ఆయన చివరి రోజుల్లో మద్యానికి బాగా అలవాటవడంతో ,డయాబెటిక్ పేషంట్ అయిన ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరగడంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు మరణించారు.ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కష్టపడి తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్న రాకేశ్ మాస్టర్ ని నిజంగా మెచ్చుకొని తీరవలసిందే !