Ram Charan ACA: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా ఆధునీకరించిన మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గ్రాండ్ ఓపెనింగ్‌కు ముస్తాబైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 ముగింపు దశ (మంగళగిరి లీగ్) మ్యాచ్‌ల ప్రారంభోత్సవ వేడుకలకు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. విజయవాడ ఎంపీ, ఏసీఏ ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ (చిన్ని) నేతృత్వంలో ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. సినిమా, క్రీడా రంగాల కలయికతో జూన్ 24న జరగబోయే ఈ కార్యక్రమం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక ఫ్లడ్‌లైట్లు, ఆరు హై-క్వాలిటీ పిచ్‌లు, మోడరన్ డ్రెస్సింగ్ రూమ్స్‌తో పాటు క్రీడాకారులు, అధికారుల వసతి కోసం 75 లగ్జరీ గదులను ఇక్కడ నిర్మించారు. విశాఖపట్నం, కడపలలో మొదటి విడత లీగ్ మ్యాచ్‌లు విజయవంతంగా ముగియగా.. టోర్నమెంట్‌లో అత్యంత కీలకమైన సెమీఫైనల్స్, క్వాలిఫైయర్స్ మరియు గ్రాండ్ ఫైనల్‌కు మంగళగిరి వేదిక కానుంది. జూన్ 24 నుండి జూన్ 30 వరకు ఇక్కడ హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read also-‘పెద్ది’తో నిజమైన నాటి తండ్రి మాట.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!
క్రికెట్ ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఏసీఏ యాజమాన్యం ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించింది. ఇక జూన్ 30న జరగబోయే ఈ మెగా టోర్నీ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీని అందించనున్నారు. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ వన్డే, టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేలా ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రమాణాల ప్రకారం సిద్ధం చేశారు.
Mega Power Star @AlwaysRamCharan to grace the Grand Inauguration of the ACA International Cricket Stadium, Mangalagiri.
📅 June 24 | 🕕 6 PM@AndhraT20League pic.twitter.com/wLc48RTFEN
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 24, 2026