Peddi First Single: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా ఇది. ఉప్పెన సినిమాతో దర్శకుడుగా పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే వందకోట్లు మార్కెట్లో ఎంటర్ అయిపోయాడు. సుకుమార్ శిష్యుడుగా బుచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. వాస్తవానికి ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చి సినిమా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవరు ఊహించిన విధంగా రామ్ చరణ్ తేజ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు బుచ్చిబాబు.
రామ్ చరణ్ తేజ్ తో ఇదివరకే రంగస్థలం సినిమాతో మంచి పరిచయం ఉంది. ఆ సినిమాలో చాలావరకు బుచ్చి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని స్వయంగా సుకుమార్ తెలియజేశారు. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తో సినిమా అంటే బుచ్చి ఏ రేంజ్ లో డిజైన్ చేశాడు మనకు ఈజీగా అర్థమయిపోతుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ట్విట్టర్ వేదిక ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. అలానే మ్యూజిక్ స్టూడియో నుంచి ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు , రామ్ చరణ్ ఉన్నారు. సినిమా సోల్ ని ఏఆర్ రెహమాన్ బాగా క్యాప్చర్ చేశారు అలానే పెద్ది ఎమోషన్ ని పట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రానుంది చూస్తూ ఉండండి అంటూ రాంచరణ్ తేజ్ స్వీట్ వేశారు. ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ లో ఈ వార్త జోష్ నింపుతుంది.
#Peddi – an @arrahman musical ❤🔥
The maestro has captured the soul and emotion of #Peddi like never before.
Our first single is coming soon – stay tuned!@PeddiMovieOffl pic.twitter.com/XHsXgm868V— Ram Charan (@AlwaysRamCharan) September 1, 2025