E-Paper
Advertisement

Tollywood: ఇండస్ట్రీలోకి మెగా మేనేజర్ వారసుడు ఎంట్రీ.. మూవీ ఏంటో తెలుసా?

Tollywood: ఇండస్ట్రీలోకి మెగా మేనేజర్ వారసుడు ఎంట్రీ.. మూవీ ఏంటో తెలుసా?
Advertisement

Tollywood: సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో కైనా సరే సెలబ్రిటీల వారసులు రావడం సహజం. కానీ ఆ సెలబ్రిటీల దగ్గర మేనేజర్లుగా పనిచేస్తున్న వారి వారసులు కూడా ఎంట్రీ ఇస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా మేనేజర్ వారసుడి ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మెగా అభిమానులు మాత్రం ఆ కుర్రాడు గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన ఎవరో కాదు రామ్ చరణ్ (Ram Charan) మేనేజర్ ప్రవీణ్ (Praveen)కుమారుడు దృషిక్(Dhrushik).

ఇండస్ట్రీకి మెగా మేనేజర్ వారసుడి ఎంట్రీ..

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఈ వార్తలు వినిపిస్తున్నా .. తాజాగా ఆయన సినీ ఎంట్రీ కన్ఫామ్ అవడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లండన్లో ఇప్పటివరకు నటనలో శిక్షణ పొందిన ఈయన మ్యాడ్ 3 ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో దృషిక్ కూడా ఒక హీరోగా ఎంపికయ్యారు.. మెగా ఫ్యామిలీ మద్దతుతో పాటు నటన, డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉన్న ఈ యువ హీరో పై ఇప్పుడు సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. మరి ఇండస్ట్రీలోకి మెగా సపోర్ట్ తో అడుగుపెడుతున్న దృషిక్ కచ్చితంగా సక్సెస్ అవుతారనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

మ్యాడ్ 3లో మరో అవకాశం..

Advertisement

మ్యాడ్ సినిమా విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మ్యాడ్ తో పాటు మ్యాడ్ స్క్వేర్ కూడా రిలీజ్ అయి ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు మ్యాడ్ 3 కూడా రాబోతోంది. ఈ సినిమా ద్వారానే మెగా మేనేజర్ వారసుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఇప్పుడు ఈ నాలుగవ హీరోకి అవకాశం ఎక్కడ కల్పిస్తున్నారు? ఏ పాత్ర ఇవ్వనున్నారు? ఆయన పాత్ర కథను ఎలా మలుపు తిప్పుతుంది? అనే విషయం తెలియాల్సి ఉంది..

చిరంజీవి సినిమాలు..

మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఒకవైపు తన కుటుంబంలోని వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తమ దగ్గర పని చేస్తున్న వారికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో బాగానే ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Tollywood Movies: భారీ అంచనాలు – బాక్సాఫీస్‌లో భారీ నిరాశ.. హైప్ తట్టుకోలేక కూలిన సినిమాలు

పెద్ది సక్సెస్ కోసం రామ్ చరణ్ ఆరాటం..

రామ్ చరణ్ విషయానికి వస్తే.. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మళ్లీ ఈ విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×