E-Paper
Advertisement

Telangana Tiger Alert: ఆ పులి ఎక్కడ? సిద్దిపేటలోఉందా? ఇతర ప్రాంతాలకు వచ్చిందా?

Telangana Tiger Alert: ఆ పులి ఎక్కడ? సిద్దిపేటలోఉందా? ఇతర ప్రాంతాలకు వచ్చిందా?
Advertisement

Telangana Tiger Alert: పులి ఎక్కడుందో తెలియదు.. ఎక్కడ తిరుగుతుందో తెలియదు..ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు పులిని గుర్తించలేదు..రోజులు గడుస్తున్నాయి కానీ జాడ తెలియలేదు.. ఎవరిపైనానైనా దాడిచేస్తుందోనని ప్రజలు జంకుతున్నారు.అడవిలో నుంచి పులి జనారణ్యంలోకి వచ్చింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి, కావల్ టైగర్ రిజర్వ్‌తో పాటు పలు జిల్లాల మీదుగా సంచరిస్తూ ప్రస్తుత ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. కెమెరా ట్రాప్‌ల ద్వారా లభించిన సమాచారం ప్రకారం ఈ పులి మగ పులిగా నిర్ధారణ అయింది. గత రెండు నెలలుగా సంచరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చింది. సిద్దిపేట-యాదాద్రి జిల్లా సరిహద్దుల్లో ఈ నెల మొదటివారంలో సంచరించింది. ఆతర్వాత సిద్దిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచరించినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఆ పులిని కొనుగొని పట్టుకునేందుకు, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను వేశారు. పులికదలికలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ప్రకటించారు. పులికి ఎలాంటి హాని జరుగకుండా ట్రాకర్లు, అటవీ సిబ్బంది పర్యవేక్షణ చేస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాదు పులి కదలికలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Also Read: Vijay Rashmika: విజయ్ దేవరకొండ పెళ్లికి మీడియా నొ ఎంట్రీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

పులి సంచరిస్తుందా?

ఈ కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రమేష్, హైటికోస్ (హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ) సభ్యుడు ఇమ్రాన్ సిద్దిక్, పుణెకు చెందిన ఆర్ఈఎస్ఓ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి 15 రోజులు దాటింది. ఇప్పటివరకు కనుగొనలేదు.దీనికి తోడు ప్రజలకూ, పులికీ ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు సిద్ధిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పుణె నుంచి వచ్చిన టైగర్ రెస్క్యూ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, స్థానిక వెటర్నరీ డాక్టర్లు సహకారం అందిస్తున్నారని పట్టుకుంటున్నామని పేర్కొంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆదిశగా ముందుకు సాగలేదు. దీనికి తోడు సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచరిస్తుందని అధికారులు అలర్టు అయినా దానిని పట్టుకోలేదు.

పులిని గుర్తించి దానిని పట్టుకుంటారా? లేదా?

Advertisement

పులితో ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్‌ ఇమేజింగ్‌ డ్రోన్లను వినియోగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని శానిగరం, కోహెడ మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది.
రాత్రివేళ అవసరం లేకపోతే బయటకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాలని చెప్పింది కానీ రోజులు గడుస్తున్నా ఆ పులిని పట్టుకోకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పులి ఆ జిల్లాలో జరుగుతుంది.. ఈ జిల్లాలో తిరుగుతుంది.. దాని జాడలు కొనుగొన్నామని అధికారులు చెబుతున్నారు. డ్రోన్లతో పులికదలికలను గమనిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా పులిని గుర్తించి దానిని పట్టుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ, మెదక్ జిల్లాల ప్రజల్లో మాత్రం భయం నెలకొంది. అధికారులు ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి.

Also Read:India vs Netherlands: టాస్ ఓడిన నెద‌ర్లాండ్స్‌..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే, ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్ల‌తో రంగంలోకి టీమిండియా 

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×