Peddi OTT: ‘పెద్ది’..గేమ్ చేంజర్ సినిమా బొక్కబోర్లా పడటంతో ఎలాగైనా సాలిడ్ సక్సెస్ కొట్టాలంటూ బుచ్చి బాబు దర్శకత్వంలో పట్టాలెక్కించిన సినిమా ఇది.స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 450కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.
అలా థియేట్రికల్ రన్ లో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇపుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లలో దుమ్మురేపడానికి రెడీ అయిపొయింది. అవును …జులై 9 నుంచి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది..మొత్తానికి తెలుగులో ఈ ఏడు ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఇపుడు థియేటర్లకే పరిమితం కాకుండా బుల్లి తెర ఆడియన్స్ ని కూడా అలరించడానికి వస్తుందన్న మాట.
మూడేళ్ల పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా
సినిమా విషయానికి వస్తే ఉప్పెన సినిమాతో మొదటిసారే వందకోట్ల క్లబ్ లోకి చేరిన బుచ్చి బాబు సానా మూడేళ్ల పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా ఇది.ఈ సినిమాలో ఇంతకు ముందెప్పుడూ కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపించడంతో మురిసిపోయారు మెగా ఫ్యాన్స్.ఇక చరణ్ కెరీర్‌లోనే ‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి నటన అంటూ ఆకాశానికి ఎత్తేశారు ట్రేడ్ పండితులు.
ఇక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు.ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ లో కనిపించగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు, మరియు తారక్ పొన్నప్పలు కీ రోల్స్ లో కనిపించి మెప్పుంచారు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయనడంలో సందేహం లేదు.
ఎలాంటి సంచలనాలకి నాంది పలుకుతుందో !
ఇక జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.అయితే ఒక్క హిందీ మాత్రం ఒక రోజు లేట్ గా అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్, లేదా సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్.అయితే తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి వసూళ్ళ వర్షం కురిపించిన ఈ సినిమా బాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో అంతగా సత్తా చాటలేకపోయింది.
also read:విప్లవ వీరుడి పాత్రలో జీవించిన కృష్ణ.. అల్లూరి జయంతి ప్రత్యేకం!
దీంతో ఇపుడు డిజిటల్ స్ట్రీమింగ్ తో నైనా గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తుందట డిజిటల్ టీమ్.చూడాలి మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై పెద్ది సినిమా ఎలాంటి సంచలనాలకి నాంది పలుకుతుందో !