YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన వైఏస్ జగన్, ఆయన చెల్లి అయిన వైఏస్ షర్మిల మధ్య ఆస్ధుల వివాదం మరో సారీ తెరపైరి వచ్చింది. ఇక వివరాల్లొకి వెలితే.. వైఎస్ షర్మిలను యలహంక ప్యాలెస్‌లోకి రానివ్వొద్దంటూ వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వార్త ఇప్పడు సంచలనంగా మారింది.
బెంగళూరులోని దేవనహళ్లి కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేసారు. షర్మిల ప్రవేశాన్ని అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని జగన్ కోరారు. బెంగళూరులోని దేవనహళ్లి కోర్టులో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో జగన్ పిటిషన్ దాఖలు చేసారు. యలహంక నివాసం తన అత్తగారు సుగుణమ్మ పేరిట ఉందని జగన్ వర్గం ఆరోపిస్తుంది. దీంతో ఈ అంశం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
అయితే వైఎస్ షర్మల రేపు కుటుంబ సభ్యులతో కలిసి యలహంక వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాయారం. తన కుమార్తె అయిన అంజలి రెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రిక అందించేందుకు బెంగళూరు పర్యటనకు షర్మిల వెల్లనున్నట్టు తెలిపారు. దీంతో అన్నాచెల్లెళ్ల ఆస్తుల వివాదం మరోసారి కోర్టు మెట్లెక్కింది. జగన్ పిటిషన్‌పై దేవనహళ్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఉత్కంఠ రేపుతుంది.
Also read: బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!