BigTV English

Mokshagna teja: హమ్మయ్య .. పట్టాలెక్కుతున్న మోక్షజ్ఞ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హీరో!

Mokshagna teja: హమ్మయ్య .. పట్టాలెక్కుతున్న మోక్షజ్ఞ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హీరో!

Mokshagna teja: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం బాలకృష్ణ(Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ.. అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈయన సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడక పోవడంతో అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఆగిపోయిన మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా?

ఇకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అదే విధంగా ఆ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనంగా మారింది. ఇక మోక్షజ్ఞ సినిమాకు ఎలాంటి ఆటంకాలు లేవని అభిమానులు భావిస్తున్న తరుణంలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి మరొక నటుడు నారా రోహిత్(Nara Rohit) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారా రోహిత్ ప్రస్తుతం సుందరాకాండ (Sundarakanda)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.


లవ్ స్టోరీ సినిమా ద్వారా ఎంట్రీ…

ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే నారా రోహిత్ నందమూరి మోక్షజ్ఞతేజ సినిమా ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మోక్షజ్ఞ తన ఫస్ట్ సినిమా అద్భుతమైన ప్రేమ కథ సినిమాగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ లవ్ స్టోరీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏడాది చివరిలో లేదా వచ్చేయేడాది మొదట్లో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని నారా రోహిత్ వెల్లడించారు.

స్లిమ్ లుక్ లోకి మారిపోయిన మోక్షజ్ఞ..

ఇలా నారా రోహిత్ మోక్షజ్ఞ సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే మోక్షజ్ఞ బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్యం 369 సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మోక్షజ్ఞ లవ్ స్టోరీ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం సరైన నిర్ణయం అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఒకప్పుడు మోక్షజ్ఞ ఎంతో బొద్దుగా కనిపించేవారు కానీ ఇటీవల కాలంలో పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పర్ ఫెక్ట్ హీరో కట్ అవుట్ అంటూ మోక్షజ్ఞ ఫోటోలను మరింత వైరల్ చేశారు.

Also Read: Sreemukhi : ట్రాన్స్ జెండర్ ను దత్తత తీసుకున్న శ్రీముఖి.. నిజంగా గ్రేట్ అంటూ!

Related News

Suriya Political Entry : ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న హీరో సూర్య… లెటర్ రిలీజ్ చేసిన ఆయన టీం

Ragile Ragile Song: రగిలే రగిలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!

Dasari Kiran: పోలీసుల అదుపులో రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్!

National Crush: నేషనల్ క్రష్ ట్యాగ్ పై చిచ్చుపెట్టిన బాలీవుడ్ నటుడు.. రష్మిక కాదు ఆమెనే అంటూ!

Tollywood: డైరెక్టర్గా యూటర్న్ తీసుకున్న రామ్ చరణ్ బ్యూటీ.. ఎవరంటే?

Big Stories

×