Ram Charan Herione:టాలీవుడ్ ప్రేక్షకులకు చిరుత సినిమా ద్వారా పరిచయమైన నేహా శర్మ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఆమె తీసుకున్న ఒక కొత్త నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. నేహా శర్మ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిట్ సుబ్స్క్రిప్షన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.290గా ఉంచింది.
ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దాదాపు 2,400 మందికి పైగా ఆమెను సబ్‌స్క్రైబ్ చేసినట్లు సమాచారం. దీని ద్వారా ఆమెకు నెలకు సుమారు రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
కొంతమంది నేహా శర్మ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ఆదాయం పొందడం ఒక కొత్త మార్గమని, ఇందులో తప్పేమీ లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మరోవైపు కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు చేశారు. ఆమె కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి కూడా అనవసర వ్యాఖ్యలు చేశారు.
ఇంకా కొందరు ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా లాగి విమర్శించారు. నేహా శర్మ తండ్రి బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అయితే ఈ విమర్శల్లో చాలా వరకు వ్యక్తిగతంగా దూషించే విధంగా ఉండటం గమనార్హం.
మరికొందరు ఆమె paid content ను తప్పుగా అర్థం చేసుకుని అసభ్యంగా వ్యాఖ్యానించారు. కానీ వాస్తవానికి ఆమె పోస్ట్ చేసే కంటెంట్ ఫ్యాషన్ ఫోటోలు, బ్రాండ్ ప్రమోషన్లు వంటి సాధారణ విషయాలేనని సమాచారం. ఇవి చాలామంది ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసే సాధారణ పని.
ఈ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో మహిళలపై జరిగే ట్రోలింగ్ మరోసారి బయటపడింది. ఒక మహిళ తన కెరీర్‌లో తీసుకునే నిర్ణయాలపై ఎక్కువగా విమర్శలు రావడం సాధారణమైపోయింది. కానీ ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారు తీసుకునే హక్కు ఉంది.
ప్రేక్షకులుగా మనకు ఇష్టమైతే ఆ కంటెంట్‌ను ఫాలో అవ్వచ్చు, లేకపోతే పట్టించుకోకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా దూషించడం, ట్రోలింగ్ చేయడం మాత్రం సరైనది కాదు. నేహా శర్మ విషయంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియా వాడకం ఎలా ఉండాలో మనకు గుర్తు చేస్తోంది.
ALSO READ: Kalyan Ram: వెంకటేష్ సినిమాలో యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న కళ్యాణ్ రామ్..!