RCB-Ananya Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టుకు కొత్త ఓనర్ షిప్ వచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు మరో మూడు కంపెనీలు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాయి. రూ.16,700 కోట్లు పెట్టి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ కూతురు అనన్య బిర్లా (Ananya Birla) పేరు మారుమవుతోంది. బెంగళూరు జట్టుకు చైర్మన్ గా ఆర్యమాన్ బిర్లా ( Aryaman Birla) కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ… ఆ జట్టు పూర్తి బాధ్యతలు మాత్రం అనన్య బిర్లా చూసుకోబోతున్నారట. అచ్చం కావ్య పాప, ప్రీతీ జింటా తరహాలోనే బెంగళూరు జట్టును ప్రమోట్ చేయబోతున్నారు అనన్య బిర్లా ( ananya birla).
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా ఆస్తులు వైరల్ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటాల కంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అనన్య బిర్లా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ఆస్తులు రూ. 409 కోట్లు మాత్రమే. అటు పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ గా ఉన్న ప్రీతీ జింటా ఆస్తులు రూ. 183 కోట్లు మాత్రమే అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అనన్య బిర్లా ఆస్తులు మాత్రం వీళ్ళకంటే డబుల్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.1770 కోట్లతో అనన్య బిర్లా ముందంజలో ఉంది. ఇవి కేవలం ఆమె వ్యక్తిగతంగా సంపాదించుకున్నవి మాత్రమే అని తెలుస్తోంది. అంటే సొంతంగానే ఓ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయొచ్చు..లేదా కొత్త జట్టును మెంటేన్ చేసేంత ఆస్తులు ఆనన్య బిర్లా దగ్గర ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మొత్తం నాలుగు కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో మెజారిటీ షేర్లను ఆదిత్య బిర్లా గ్రూప్ కొనేసింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్ కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం రూ. 16,700 కోట్లు పెట్టి ఆర్సీబీ జట్టును కొనుగోలు చేశారు.