E-Paper
Advertisement

Fake Fertilizers: పంట కోతకొచ్చే వేళ రైతన్నకు గుండె కోత.. అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి..!

Fake Fertilizers: పంట కోతకొచ్చే వేళ రైతన్నకు గుండె కోత.. అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి..!
Advertisement

Fake Fertilizers: స్వేచ్ఛ బ్యూరో: దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వెన్నుముక రైతన్నకు తోడుగా.. ఉండాల్సిన అగ్రికల్చర్ ఇతర అధికార యంత్రాంగం మొక్కుబడి విధులు ఎరువుల, పురుగు మందుల వ్యాపారుల అత్యాశ అన్నదాతలను నిండా ముంచేస్తున్నాయి. నాటే విత్తనం నుంచి ఎరువులు, పురుగుమందుల కల్తీ అన్నీ కలిసి రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా ఇంటిలిపాదిని మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఓవైపు కల్తీ ఎరువులు పురుగు మందులు, మరోవైపు పరిమితికి మించి పురుగు మందుల వాడకంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతన్నల శ్రమ వృధా అవుతోంది.

అడ్డగోలుగా ఫెర్టిలైజర్ షాప్‌ల నిర్వహణ

ఫెర్టిలైజర్ షాపుల ఏర్పాటుకు ఉండాల్సిన అర్హతలు లేనప్పటికీ ఇతరుల పేరిట లైసెన్సులు పొందుతున్న వ్యాపారులు అడ్డగోలుగా పురుగుమందులు, ఎరువులను యదేచ్చగా అమ్మేస్తున్నారు. కలుపును నివారించే గడ్డి మందు నుంచి తెగుళ్లను నివారించే అన్ని రకాల పురుగుమందులను రైతులకు విక్రయించే విషయంలో వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పంటదశలను, భూమి స్వభావం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎరువులను పురుగుమందులను వేస్తేనే దిగుబడి పెరిగి రైతన్నకు ప్రయోజనం కలుగుతుంది. ఈ వ్యవహారం పక్కన పెడితే వరి మొక్క పెరుగుదల, వచ్చిన తెగులు ఇతర అంశాలపై రైతుకు అవగాహన లేకపోవడంతో ఇదే అదునుగా ఫెర్టిలైజర్ దుకాణా యజమానులు ఇష్టం వచ్చినట్లు పురుగుమందులను అంటగడుతుండడంతో కొంతమంది రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

Also Read: Congress : జీవన్ రెడ్డి గుడ్ బై..కాంగ్రెస్‌కు ప్లస్సా.. మైనసా?

మిర్యాలగూడ రూరల్ పోలీసులకు రైతన్న ఫిర్యాదు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్ తండా కు చెందిన రైతు దాడి హనుమ.. ఇదే తండా పరిధిలోని 8 ఎకరాలను కౌలుకు తీసుకొని 1010 రకం వడ్లను సాగు చేశాడు. మరో 15 నుంచి 20 రోజులు అయితే పంట కోతకు వస్తుంది. దోమ నివారణకుకు ఇటీవల సమీప గ్రామంలోని ఫెర్టిలైజర్ షాపులో తెగులు నివారణకు మందులు కొనుగోలు చేసి స్ప్రే చేశాడు. అయితే స్ప్రే చేసిన మరుసటి రోజు తన 8 ఎకరాల పొలం ఎర్రబారిందని ఫర్టిలైజర్ షాపుల లీడర్లతోపాటు అధికారులకు, అదేవిధంగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు దాడి హనుమ తెలిపాడు. ఈనెల 20వ తేదీ వరకు క్షేత్రస్థాయికి వచ్చి సైంటిస్టులు పొలం ఎర్రబారిన విషయంపై పరిశీలన చేస్తారని అధికారులు చెప్పటంతో వేచి చూశామని ఇప్పటివరకు స్పందన లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎకరానికి 11 బస్తాల కౌలు చెల్లించాలని ఇప్పటికీ 8 ఎకరాలకు సుమారు లక్ష వరకు పెట్టుబడి అయిందని పొలం ఎర్రబారడంతో తీవ్రంగా నష్టపోయామరని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. దోమ నివారణకు వాడిన పురుగుమందులతో రైతన్న పంట నష్ట పోయిన వ్యవహారం తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లో వెలుగు చూడటం అధికారులు ఏం న్యాయం చేస్తారన్న విషయం వేచి చూడాల్సి ఉంది.

సీజన్ ముగిసే వరకు.. నిఘా అవసరం

Advertisement

నల్లగొండ జిల్లాలో 5.56 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. 30 శాతం సన్న రకం, 70 పర్సెంట్ దొడ్డు రకం వడ్ల సాగు చేపట్టారు. ఈ రబీ సీజన్ లో 13 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తుండ్రు. అయితే ప్రస్తుతం 5 నుంచి 10 శాతం మేర కోతలు ప్రారంభమయ్యాయి. మరో వారంలో పూర్తిస్థాయిలో కోతలు రానుండగా చివరి దశలో తెగుళ్లతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు పురుగుమందులను ఆశ్రయిస్తున్నారు. అడ్డగోలుగా పురుగుమందులను వినియోగిస్తే దిగుబడిపై ప్రభావం చూపటం తో పాటు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉన్నందున అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటను పూర్తిగా కోసి తరలించే వరకు రైతులకు అడ్డగోలు పురుగుమందుల వినియోగంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Also Read: RCB Sold: SRHకు కావ్య పాప ఉంటే, ఇక RCBకి మ‌రో అందాల తార‌..ఎవ‌రీ అన‌న్య బిర్లా?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×